• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND IND BEAT ENG BY INNS 25 RUNS TO FACE NZ IN WTC FINAL SA

India vs England: టీమ్‌ఇండియా సిరీస్ ఘన విజయం.. స్పిన్నర్ల చేతిలో ఇంగ్లాండ్ చిత్తు!

India vs England: టీమ్‌ఇండియా సిరీస్ ఘన విజయం..  స్పిన్నర్ల చేతిలో ఇంగ్లాండ్ చిత్తు!

team india 4

ఇంగ్లండ్‌‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు టెస్ట్ సిరీస్‌లో 3-1తో అద్భుత విజయాన్ని అందుకుంది.

  • Share this:
    ఇంగ్లండ్‌‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు టెస్ట్ సిరీస్‌లో 3-1తో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌ను టీమిండియా స్పీన్నర్లు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్ భారత్ బౌలర్ల దాటికి తట్టుకోలేక కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్‌ 25 పరుగులతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఈ గెలుపుతో టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. కోహ్లీసేన 3-1తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.



    మెుదటి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌‌లో 135 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా 160 పరుగుల అధిక్యాన్ని కూడా సమం చేయలేకపోయింది. భారత్ బౌలర్లు అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ చేరో ఐదు వికెట్ల తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టారు.





    ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్ప్‌లో డేనియెల్‌ లారెన్స్‌ (50), జో రూట్‌ (30) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఈ గెలుపుతో ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జూన్‌లో లార్డ్స్‌ మైదనంలో న్యూజిలాండ్‌తో ఫైనల్లో ఆడనుంది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు