విజయ్ శంకర్‌పై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు

ICC Cricket World Cup 2019 | ఈ వరల్డ్ కప్‌లో విజయ్ శంకర్ ప్రతిభకు తగ్గ ఆట ఆడలేదని పరోక్షంగా అంగీకరిస్తూనే.. కచ్చితంగా ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడని నమ్మకంగా చెప్పాడు.

news18-telugu
Updated: June 29, 2019, 10:45 PM IST
విజయ్ శంకర్‌పై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీ
  • Share this:
టీమిండియా ఆటగాడు, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ మీద కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. చేతి గాయంతో వరల్డ్ కప్ నుంచి తప్పుకొన్న శిఖర్ ధావన్ ప్లేస్‌లో తుది జట్టులోకి వచ్చిన విజయ్ శంకర్ అతడి మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మాత్రం ఆడలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపించాడు. ఈ క్రమంలో ఈ తమిళనాడు ఆటగాడి మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు విజయ్ శంకర్ మీద జోక్స్ కూడా పేల్చారు. ఈ క్రమంలో విజయ్ శంకర్ ఫామ్ మీద కోహ్లీ స్పందించాడు. ఈ వరల్డ్ కప్‌లో విజయ్ శంకర్ ప్రతిభకు తగ్గ ఆట ఆడలేదని పరోక్షంగా అంగీకరిస్తూనే.. కచ్చితంగా ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడని నమ్మకంగా చెప్పాడు. ‘పాక్ పై బాగానే ఆడాడు. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లోనూ ఆధారపడదగ్గ ఆటగాడిగా కనిపించాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ లో బాగా ఆడుతున్న దశలో రోచ్ వేసి ఓ అద్భుతమైన బంతికి ఔటయ్యాడు’ అని కోహ్లీ అన్నాడు.

First published: June 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు