India vs England : నాలుగో టెస్ట్ లో శతక్కొట్టిన రిషభ్ పంత్..సిక్స్ తో సెంచరీ..

రిషభ్ పంత్ (Photo : Bcci)

India vs England : మొతేరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో రిషభ్ పంత్ రెచ్చిపోయాడు. సూపర్ హిట్టింగ్ తో అదిరిపోయే సెంచరీ చేశాడు.

  • Share this:
    మొతేరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో రిషభ్ పంత్ రెచ్చిపోయాడు. సూపర్ హిట్టింగ్ తో అదిరిపోయే సెంచరీ చేశాడు. జో రూట్ బౌలింగ్ లో సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు ఈ డైనమైట్ బ్యాట్స్ మన్. రిషభ్ పంత్ వీరవీహారంతో టీమిండియా భారీ ఆధిక్యం సాధించే దిశలో సాగుతోంది. 146 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెటకు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, సెంచరీ చేసిన తర్వాత రిషభ్ పంత్ వెంటనే అవుటయ్యాడు. అండర్సన్ బౌలింగ్ లో జో రూట్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 118 బంతుల్లో 101 పరుగులు చేశాడు రిషభ్ పంత్. అతని ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయ్. ప్రస్తుతం టీమిండియా 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఉన్నారు. సుందర్ కూడా సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు.


    24/1 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. ఓవైపు పుజారా(17), విరాట్ కోహ్లీ(0), రహానే(27) విఫలమైనా రోహిత్.. నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ స్టోక్స్ దెబ్బతో అతను కూడా ఔటవ్వడం, ఆ వెంటనే అశ్విన్(13) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ స్థితిలో టీమిండియా ఇన్నింగ్స్ ను ఆదుకున్నారు పంత్, సుందర్.
    Published by:Sridhar Reddy
    First published: