India vs England : రిషభ్ పంత్ జోరు..ఇంగ్లండ్ బేజారు..రెండో రోజు కూడా టీమిండియాదే...

India vs England (Photo Credit : BCCI)

India vs England : మొతేరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసిన సమయానికి ...

  • Share this:
    మొతేరా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసిన సమయానికి ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 294 పరుగులు చేసింది. ప్రస్తుతం 89 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన. క్రీజులో వాషింగ్టన్ సుందర్ (60 పరుగులు), అక్షర్ పటేల్ (11 పరుగులు) తో అజేయంగా ఉన్నారు. ఇక, రెండో రోజు ఆటలో రిషభ్ పంతే సూపర్ హీరో. సూపర్ సెంచరీతో ఇంగ్లండ్ ఆశల మీద నీళ్లు చల్లాడు రిషభ్ పంత్. 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును పంత్ తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో గట్టెక్కించాడు. ఓ దశలో భారత్ కనీసం 200 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ క్రీజులోకి వచ్చిన యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సాయంతో పంత్ చెలరేగాడు. ఈ క్రమంలో జోరూట్ వేసిన 84 ఓవర్ తొలి బంతిని స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన పంత్.. 115 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో కెరీర్‌లో మూడో సెంచరీని అందుకున్నాడు. అయితే జేమ్స్ అండర్సన్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించిన పంత్.. షార్ట్ మిడ్‌వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రూట్‌కు చిక్కాడు. దాంతో తీవ్ర నిరాశగా పెవిలియన్ చేరాడు.

    ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో సుందర్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. పంత్ ఔటైనా.. ఏ మాత్రం జోరు తగ్గకుండా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే స్టోక్స్ వేసిన 87 ఓవర్ తొలి బంతిని ఫోర్, ఆ తర్వాత క్విక్ డబుల్ తీసి కెరీర్‌లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


    24/1 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. ఓవైపు పుజారా(17), విరాట్ కోహ్లీ(0), రహానే(27) విఫలమైనా రోహిత్.. నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ స్టోక్స్ దెబ్బతో అతను కూడా ఔటవ్వడం, ఆ వెంటనే అశ్విన్(13) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ స్థితిలో టీమిండియా ఇన్నింగ్స్ ను ఆదుకున్నారు పంత్, సుందర్.
    Published by:Sridhar Reddy
    First published: