India vs England : పుణెలో వన్డే వార్..ఇద్దరు కొత్త ఆటగాళ్లతో బరిలోకి భారత్..టాస్ గెలిచిన ఇంగ్లండ్..

పుణెలో వన్డే వార్..ఇద్దరు కొత్త ఆటగాళ్లతో బరిలోకి భారత్..టాస్ గెలిచిన ఇంగ్లండ్..

India vs England : పుణె వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు వన్డే సిరీస్‌కు సిద్దమయ్యాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, ఈ మ్యాచ్ లో టీమిండియా తరుఫున ఇద్దరు యంగ్ స్టార్స్ అరంగేట్రం చేయనున్నారు.

  • Share this:
    పుణె వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు వన్డే సిరీస్‌కు సిద్దమయ్యాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, ఈ మ్యాచ్ లో టీమిండియా తరుఫున ఇద్దరు యంగ్ స్టార్స్ అరంగేట్రం చేయనున్నారు. బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ, ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరికి ఇదే ఫస్ట్ వన్డే మ్యాచ్. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. వన్డేల్లో రెగ్యులర్‌ ఆటగాళ్లు రూట్, వోక్స్‌లకు సిరీస్‌ నుంచి ఇంగ్లండ్‌ విశ్రాంతినివ్వగా... ఆర్చర్‌ గాయంతో వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీలకు చోటు కల్పించింది ఇంగ్లండ్ టీమ్.తొలి టెస్టులో ఓడిన తర్వాత వరుస విజయాలతో సిరీస్‌ సొంతం చేసుకున్న టీమిండియా... హోరాహోరీగా సాగిన టి20ల్లోనూ ముందు వెనుకబడ్డా ఆ తర్వాత చెలరేగి విజేతగా నిలిచింది. ఇక వరల్డ్‌ చాంపియన్‌తో వన్డే సమరంలోనూ గెలిస్తే విజయం సంపూర్ణమవుతుంది. మరోవైపు ఈ ఫార్మాట్‌లోనైనా సిరీస్‌ అందుకొని గౌరవంగా స్వదేశం వెళ్లాలని ఇంగ్లండ్‌ కోరుకుంటోంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్, టి20 ప్రపంచకప్‌ కారణంగా ఈ ఏడాది వన్డేలకు అంత ప్రాధాన్యత కనిపించకపోయినా... రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమంటున్నారు క్రీడా పండితులు. కరోనా ఎఫెక్ట్ తో ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్‌ నిర్వహించనున్నారు.

    India (Playing XI): Rohit Sharma, Shikhar Dhawan, Virat Kohli(c), KL Rahul(w), Shreyas Iyer, Hardik Pandya, Krunal Pandya, Shardul Thakur, Bhuvneshwar Kumar, Kuldeep Yadav, Prasidh Krishna

    England (Playing XI): Jason Roy, Jonny Bairstow, Eoin Morgan(c), Jos Buttler(w), Ben Stokes, Sam Billings, Moeen Ali, Sam Curran, Tom Curran, Adil Rashid, Mark Wood

    మొదటి నుంచి పుణే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ నాలుగు వన్డేలు జరగ్గా మూడుసార్లు 300కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. వర్షం సమస్య లేదు. మొదటి నుంచి పుణే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ నాలుగు వన్డేలు జరగ్గా మూడుసార్లు 300కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. వర్షం సమస్య లేదు.
    Published by:Sridhar Reddy
    First published: