Home /News /sports /

India vs England : ధావన్ సెంచరీ మిస్..రాహుల్,కృనాల్ మెరుపులు..ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..

India vs England : ధావన్ సెంచరీ మిస్..రాహుల్,కృనాల్ మెరుపులు..ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..

Photo Credt : BCCI Twitter

Photo Credt : BCCI Twitter

India vs England : ఇంగ్లండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అదరగొట్టింది. ఇంగ్లండ్ భారీ టార్గెట్ సెట్ చేసింది కోహ్లీసేన. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది.

    ఇంగ్లండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అదరగొట్టింది. ఇంగ్లండ్ భారీ టార్గెట్ సెట్ చేసింది కోహ్లీసేన. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఇంగ్లండ్ టార్గెట్ 318 పరుగులు. ఆఖర్లో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల 112 పరుగుల సూపర్ పార్టనర్ షిప్ తో టీమిండియా అద్భుత స్కోరు చేసింది. ఒక దశలో 300 పరుగులు చేయలేదనుకున్న టీమిండియా.. వీరిద్దరి జోరుతో మంచి ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ కెరీర్‌లో 18వ శతకాన్ని నమోదు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 98 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెన్ స్టోక్స్ వేసిన షార్ట్ పిచ్ స్లో బంతిని పుల్ షాట్ ఆడబోయి షార్ట్ మిడ్ వికెట్‌లో ఇయాన్ మోర్గాన్‌కు క్యాచ్‌గా చిక్కాడు. రాహుల్ 43 బంతుల్లో 62 పరుగులు, కృనాల్ పాండ్య 31 బంతుల్లో 58 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. రన్ మెషీన్ 60 బంతుల్లో 56 పరుగులు చేశాడు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు రోహిత్, శిఖర్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఫస్ట్ వికెట్ కు వీరిద్దరూ 64 పరుగుల పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. అయితే 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసరపు షాట్ కు యత్నించి స్టోక్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు రోహిత్. ఆ తర్వాత కోహ్లీతో కలిసిన శిఖర్‌ ధావన్ చూడముచ్చటైన షాట్లతో అలరించాడు.

    ఏ దశలోనూ ఇబ్బంది పడని గబ్బర్‌.. బౌండరీలు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది 68 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. హాఫ్‌ సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. 90 పరుగుల వరకూ వేగంగా బ్యాటింగ్‌ చేసిన ధావన్..‌ సెంచరీకి చేరువలో ఒత్తిడిలోనయ్యాడు. 100 మార్క్‌ చేరే క్రమంలో నిదానంగా ఆడి వికెట్ చేజార్చుకున్నాడు. విరాట్‌ కోహ్లీతో కలిసి వందకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన శిఖర్ ధావన్‌.. రోహిత్‌ శర్మతో తొలి వికెట్‌కు 64 రన్స్‌ జోడించాడు.


    ధావన్ పెవిలియన్ చేరిన కాపేపటికే భారత్ మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా (1) తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. బెన్‌ స్టోక్స్‌ వేసిన 41వ ఓవర్‌ మూడో బంతికి స్లిప్‌లో బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 205 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. హార్దిక్‌ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కూడా అసౌకర్యంగానే కనిపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కృనాల్‌ పాండ్యా, రాహుల్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరి దూకుడుతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు కన్పించాయ్. వీరిద్దరి జోరుతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: India vs england, KL Rahul, Shikhar Dhawan, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు