INDIA VS ENGLAND FIFTH TEST PREVIEW ROHIT SHARMA OUT AND KS BHARAT IN HERE TEAM INDIA PREDICTED PLAYING XI AGAINST BEN STOKES TEAM SRD
India vs England Fifth Test : రోహిత్ ఔట్.. ఓపెనర్ గా తెలుగు కుర్రాడికి లక్కీ ఛాన్స్.. కీలకపోరుకు భారత తుది జట్టు ఇదే..!
Rohit Sharma- Jasprit Bumrah
India vs England Fifth Test : రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడ్డాడని తెలిపిన బీసీసీఐ.. అతని గురించి ఎటువంటి హెల్త్ అప్ డేట్ ఇవ్వలేదు. అయితే రోహిత్ శర్మ ఈ టెస్టులో ఆడేదీ లేనిదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.
గతేడాది కరోనాకారణంగా మిగిలిపోయిన టెస్టును ఆడేందుకు ఇంగ్లాండ్ కు వచ్చిన టీమిండియా (Team India)కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. లీస్టర్‌షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా గత ఆదివారం కరోనా బారిన పడ్డ భారత జట్టు సారథి రోహిత్ శర్మ (Rohit Sharma).. ఐదో టెస్టు (IND vs ENG 5th Test) కు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. అతడింకా కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీంతో ఈ టెస్టుకి రోహిత్ శర్మ దూరమైనట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగ్గా భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. చివరి మ్యాచ్‌ను గెలిచినా.. డ్రా చేసుకున్నా సిరీస్ భారత్ సొంతమవుతోంది. ఈ క్రమంలోనే సిరీస్ గెలవడమే లక్ష్యంగా భారత జట్టు రెడీ అవుతోంది. అయితే కరోనాతో రోహిత్ శర్మ దూరమవ్వడంతో టీమిండియా తుదిజట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడ్డాడని తెలిపిన బీసీసీఐ.. అతని గురించి ఎటువంటి హెల్త్ అప్ డేట్ ఇవ్వలేదు. అయితే రోహిత్ శర్మ ఈ టెస్టులో ఆడేదీ లేనిదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. అందుకింకా సమయముందని గురువారం తుది నిర్ణయం వెల్లడిస్తామని తెలిపాడు. అయితే, మీడియా కథనాల ప్రకారం ఈ టెస్ట్ మ్యాచుకు రోహిత్ శర్మ దూరమైనట్టు తెలుస్తోంది. రోహిత్ శర్మ బదులు.. టీమిండియా పేస్ గుర్రం బుమ్రా టీమిండియాకు సారధ్య బాధ్యతల్ని మోయనున్నట్టు సమాచారం.
రోహిత్‌కు బ్యాకప్‌గా మయాంక్‌కు వచ్చినా.. ప్రాక్టీస్ లేని అతన్ని నేరుగా జట్టులోకి తీసుకుంటారా? అనేది సందేహంగా మారింది. ఒకవేళ మయాంక్, రోహిత్ ఆడని పరిస్థితి ఉంటే మాత్రం తెలుగు తేజం కేఎస్ భరత్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. వన్ డౌన్ లో పుజారా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇంగ్లండ్ కౌంటీల్లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు పుజారా. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయనుండగా.. ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు.
ఆరో స్థానంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేయనుండగా.. ఏడో స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడనున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగిన అతని ప్రస్తుతం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు. ఇక ఎక్స్ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగాలా? లేక ఎక్స్ట్రా పేసరా? అనేది కూడా టీమిండియా మేనేజ్మెంట్ తేల్చుకోలేకపోతుంది.
ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలంటే అశ్విన్ తుది జట్టులో ఉంటాడు. లేదంటే సిరాజ్, ఉమేశ్ యాదవ్ల్లో ఒకరు ఆడుతారు. రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ అయిన జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. అతనికి తోడుగా శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.
చివరి టెస్టుకు రోహిత్ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటు కిందే లెక్క. గతేడాది జరిగిన నాలుగు టెస్టులలో రోహిత్ ఓ సెంచరీతో పాటు 368 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక అతడు వచ్చిన తొలి విదేశీ పర్యటన ఇది. కానీ ఈ టెస్టులో కూడా రోహిత్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. హిట్ మ్యాన్ కెప్టెన్ అయ్యాక అతడు ఆడని రెండు టీ20లలో, 3 వన్డేలలో టీమిండియా ఓడింది. మరి టెస్టులలో భారత జట్టు ఎలా ముందుకెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.