INDIA VS ENGLAND FANS SHUTS UP MICHAEL VAUGHAN FOR HIS COMMENTS AGAINST THE SURFACE USED FOR SECOND TEST SRD
India vs England : మైకేల్ వాన్.. టీమిండియా దెబ్బ ఎలా ఉంది.. పోలా.. అదిరిపోలా..
Michael Vaughan
India vs England : ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్...నోటి దురుసుతనానికి తమదైన స్టైల్ లో సమాధానమిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. ట్విటర్ వేదికగా ఈ మాజీ క్రికెటర్‌పై సెటైర్లు పేల్చుతూ ట్రోల్ చేస్తున్నారు.
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్...నోటి దురుసుతనానికి తమదైన స్టైల్ లో సమాధానమిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. ట్విటర్ వేదికగా ఈ మాజీ క్రికెటర్‌పై సెటైర్లు పేల్చుతూ ట్రోల్ చేస్తున్నారు. మైకేల్ వాన్ టీమిండియా దెబ్బ ఎలా ఉంది పోలా అదిరిపోలా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన సెకండ్ టెస్ట్‌లో భారత జట్టు ఆధిపత్యాన్ని మైకేల్ వాన్ జీర్ణించుకోలేకపోతున్నాడని కామెంట్ చేస్తున్నారు. అయితే సెకండ్ టెస్ట్ పిచ్‌పై వాన్ సెటైర్లు పేల్చడమే అభిమానుల ఆగ్రహానికి కారణం. పిచ్ పూర్తిగా భారత్‌కు అనుకూలంగా ఉండేవిధంగా తయారు చేశారనే ఉద్దేశంతో రోడ్లా ఉందని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అంతకుముందు చెపాక్ పిచ్ సుదీర్ఘ ఫార్మాట్‌కు పనికి రాదని పేర్కొన్నాడు. ఇక ఈ ట్వీట్లు చూసిన అభిమానులు వాన్‌కు తమదైన శైలిలో బదులిస్తున్నారు. ఇంగ్లండ్‌పై భారత్ ఆధిపత్యం చూస్తుంటే మైకేల్ వాన్‌కు ఎక్కడో కాలుతుందని కామెంట్ చేస్తున్నారు. ఇరు జట్లు ఒకే వికెట్‌పై ఆడాయని, ఇంగ్లండ్‌లో కూడా స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. స్పిన్ ట్రాక్‌పైనే రోహిత్ శర్మ భారీ సెంచరీ చేశాడని, ఏడో స్థానంలో వచ్చిన అశ్విన్ కూడా శతకం సాధించాడని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా పంత్, విరాట్ కోహ్లీలు హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారని తెలిపాడు. పిచ్ బాగాలేదని ఫస్ట్ మ్యాచ్ అప్పుడు ఎందుకనలేదని నిలదీస్తున్నారు. భారత్ విజయంతో మైకేల్ వాన్ పరిస్థితి ఇలా ఉందంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు.
ఇక పిచ్‌పై కామెంట్ చేసిన మైకేల్ వాన్‌కు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా కౌంటరించ్చాడు. "మొదటి టెస్టులో ఇండియా గెలవడానికి ఎటువంటి అవకాశం లేనప్పుడు.. పిచ్ గురించి ఏ ఒక్కరూ మాట్లాడరు. గత కొద్ది రోజుల క్రితమే ఇదే పిచ్‌పై తొలి టెస్టు జరిగింది. అప్పుడు ఇప్పుడు ఇరు జట్లకు ఒకే రకమైన పరిస్థితులు ఉన్నాయి.ప్రస్తుతం ఇంగ్లండ్ బౌలింగ్ పేలవంగా ఉంది. రోహిత్, పంత్, జింక్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. రెండో టెస్టుతో పోల్చితే మొదటి టెస్టులో టాస్ కీలకమైంది అంతే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ కంటే భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. 220 పరుగులకు ఆతిథ్య జట్టును కట్టడి చేయాలి. స్పిన్, సీమింగ్ మధ్య తేడా ఏమీ లేదు. ఈ పిచ్‌పై బ్యాటింగ్ ఎలా చేయాలన్న దానికి రోహిత్ ఇన్నింగ్సే ఉదహరణ "అని వార్న్ వరుసగా ట్వీట్లు చేశాడు.
It’s entertaining cricket as things are happening all the time but let’s be honest this Pitch is a shocker .. Not making any excuses as India have been better but this isn’t a Test Match 5 day prepared Pitch ... #INDvENG
Come on maaaaaate ! The last few days of the 1st test, the wicket started exploding & no one said a word about the pitch when India had no chance. At least this test it’s been the same for both teams from ball one. Eng bowled poorly & Rohit, Pant and Jinx showed how to bat. https://t.co/lx31k7BqCl
There’s no diff between the ball seaming/spinning to much. We always want a fair contest between bat/ball. India have batted & bowled better than Eng in this match - simple. Conditions have been the same for both sides from ball one. But this is excessive & in favour of the ball https://t.co/lx31k7BqCl
ఇక, పిచ్‌ను విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. "రోహిత్ ఇన్నింగ్స్ చూస్తే పిచ్ అంత ప్రమాదకరంగా ఏమీ లేదని స్పష్టమవుతోంది. పిచ్ అలా ఉంటే ఓ జట్టు 330 పరుగులు చేయగలదా? పిచ్ బ్యాటింగ్ చేయలేని విధంగా ఏమీ లేదు. కానీ బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసురుతోంది. క్రికెట్ అంటే అలాగే ఉండాలి. తొలి టెస్టు తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్ మరీ తేలిగ్గా ఉందన్నారు. ఇప్పుడు బంతికి, బ్యాటుకు సమతూకం ఉండేలా చూస్తే పిచ్ గురించి ఫిర్యాదులు చేస్తున్నారు" అన్నాడు. అసలు ఇప్పుడు చర్చ జరగాల్సింది పిచ్ గురించి కాదని.. ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఎలాంటి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారన్న దానిపై అని సన్నీ స్పష్టం చేశాడు. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 317 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.