INDIA VS ENGLAND DINESH KARTHIK SENDS REMINDER TO TEAM INDIA AFTER RISHABH PANT AND WRIDDHIMAN SAHA IN ISOLATION SRD
Dinesh Karthik : అందుకు నేను రెడీ అంటున్న దినేశ్ కార్తీక్.. మరి..బీసీసీఐ ఓకే చెప్పేనా..?
Dinesh Karthik
Dinesh Karthik : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ (Rishabh Pant)తో పాటు భారత జట్టు సహాయ సిబ్బందిలోని ఓ వ్యక్తికి కరోనా సోకిన విషయం తెలిసిందే. మరోవైపు, వృద్ధిమాన్ సాహా కూడా ముందుజాగ్రత్తగా ఐసోలేషన్‌లో చేరాడు. దీంతో బీసీసీఐకి వింత సమస్య ఎదురైంది.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ (Rishabh Pant)తో పాటు భారత జట్టు సహాయ సిబ్బందిలోని ఓ వ్యక్తికి కరోనా సోకిన విషయం తెలిసిందే. భారత జట్టు థ్రోడౌన్ స్పెషలిస్టు దయానంద్ గరాణీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దయానంద్‌ను కొన్నిరోజుల కిందటే కలిసి ప్రాక్టీస్ చేసిన వృద్ధిమాన్ సాహా కూడా ముందుజాగ్రత్తగా ఐసోలేషన్‌లో చేరాడు. ఐపీఎల్ సమయంలో సాహా కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే. దయానంద్‌కు సన్నిహితంగా ఉన్న మరో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, బ్యాట్స్‌మన్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ను కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ ముగ్గురు కరోనా నెగటివ్‌గా తేలినప్పటికీ యూకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌కు పంపారు. దాంతో టీమిండియాకు చెందిన ఐదుగురు సభ్యులు ప్రస్తుతం లండన్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక 20 రోజుల విశ్రాంతిని పూర్తి చేసుకున్న మిగతా జట్టు సభ్యులు డర్హమ్ బయలుదేరారు. ఇంగ్లండ్ సిరీస్‌కు సన్నాహాకంగా బీసీసీఐ డర్హమ్‌లో ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 20వ తేదీ నుంచి కౌంటీ ఎలెవన్ టీమ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
ఇంగ్లండ్‌లోని వివిధ కౌంటీ టీమ్స్ నుంచి ఈ మ్యాచ్‌కు 15 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. దీంతో బీసీసీఐకి వింత సమస్య ఎదురైంది. అయితే ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు ఐసోలేషన్‌లోనే ఉండటంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ ఎవరన్నది ప్రశ్నార్ధకంగా మారింది. జట్టులో ఉన్న కేఎల్ రాహుల్‌కు వికెట్ కీపింగ్ సామర్థ్యం ఉంది. వన్డే, టీ20ల్లో కీపింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులోపు పంత్, సాహా జట్టులో చేరతారని జట్టు వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో, బీసీసీఐకి దినేశ్ కార్తీక్ బంపరాఫర్ ఇచ్చాడు.
ఒకవేళ అవసరమైతే తాను సిద్ధంగానే ఉన్నానని దినేశ్ కార్తీక్ ట్విటర్ వేదికగా ఆఫర్ ఇచ్చాడు. క్రికెట్ కామెంటేటర్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన అతను ఇంగ్లండ్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'కేవలం గుర్తుచేస్తున్నా' అంటూ కిట్‌బ్యాగు, గ్లోవ్స్చిత్రాలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తుంది. భారత జట్టు తరుపున 26 టెస్టులు ఆడిన దినేశ్ కార్తీక్, ఓ సెంచరీతో పాటు 7 హాఫ్ సెంచరీలతో 1025 పరుగులు చేశాడు. అయితే, కార్తీక్ ఇచ్చిన ఆఫర్ ను బీసీసీఐ అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.