• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND DAY KOHLIS TEAM WON SECOND TEST WITH HUGE MARGIN 317 RUNS AND LEVEL THE SERIES SRD

India vs England : దెబ్బకి దెబ్బ..లెక్క సరి చేసిన టీమిండియా..రెండో టెస్ట్ లో గ్రాండ్ విక్టరీ..

India vs England : దెబ్బకి దెబ్బ..లెక్క సరి చేసిన టీమిండియా..రెండో టెస్ట్ లో గ్రాండ్ విక్టరీ..

India vs England

India vs England : చెన్నై వేదిక గా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. 317 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసింది కోహ్లీ సేన.

  • Share this:
    చెన్నై వేదిక గా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. 317 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసింది కోహ్లీ సేన. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ అల్లాడిపోయారు. ఆఖర్లో మొయిన్ అలీ మెరుపులు తప్ప ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. అక్షర్ పటేల్ ఐదు వికెట్లు తో చెలరేగగా.. అశ్విన్ మూడు, కుల్దీప్ రెండు వికెట్లు తీశారు. 482 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. 53 పరుగుల తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ను టీమిండియా స్పిన్నర్లు కోలుకోలేని దెబ్బ తీశారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశారు. రూట్ కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. 33 పరుగులు చేసిన రూట్.. అక్షర్ పటేల్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. అయితే, ఆఖర్లో మొయిన్ అలీ తన బ్యాట్ కు పని చెప్పాడు. ధాటి ఆడుతూ.. సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 18 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఐదు సిక్సర్లు ఉన్నాయ్. అయితే, చివరికి కుల్దీప్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించబోయి స్టంప్ ఔట్ అయ్యాడు అలీ.

    నిన్న 52/1 స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్(148 బంతుల్లో 14 ఫోర్లు ఒక సిక్స్‌తో 106) వీరోచిత సెంచరీ‌కి తోడు విరాట్ కోహ్లీ(149 బంతుల్లో 7 ఫోర్లతో 62) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌‌తో రాణించాడు. చివర్లో సిరాజ్(16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.


    చివర్లో మహ్మద్ సిరాజ్(21 బంతుల్లో 2 సిక్సర్లతో 16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్(4/100), మొయిన్ అలీ(4/98) నాలుగేసి వికెట్లు తీయగా.. ఓలి స్టోన్(1/21) ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లండ్‌కు టీమిండియా 482 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు