INDIA VS ENGLAND DAY 4 STUMPS TEAM INDIA NEED 381 RUNS TO WIN AGAINST ENGLAND IN CHENNAI TEST SRD
India vs England : టీమిండియాకు 381 పరుగులు..ఇంగ్లండ్ కు 9 వికెట్లు..మిగిలింది ఒక రోజే..
India vs England
India vs England : ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా గట్టెక్కడానికి పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా గట్టెక్కడానికి పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. వెలుతురులేమి కారణంగా మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగో రోజు ఆట ముగిసింది. తొలి టెస్టులో టీమిండియా విజయానికి ఇంకా 381 పరుగులు కావాలి. . నాల్గో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌటైంది. దాంతో టీమిండియాకు 420 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(12) వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. జాక్ లీచ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. అనంతరం చతేశ్వర్ పుజారా బ్యాటింగ్‌కు వచ్చాడు. సోమవారం ఆట ముగిసే సమయానికి శుబ్‌మన్ గిల్(15 బ్యాటింగ్), పుజారా(12 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు విలవిల్లాడిన ఇంగ్లండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ రెండొందల పరుగుల మార్కు చేరకుండా కట్టడి చేశాడు. అయితే, తన టెస్టు కెరీర్లో ఐదు వికెట్ల మార్కును చేరడం అశ్విన్‌కు ఇది 28వ సారి కాగా ఇంగ్లండ్‌పై నాల్గోసారి. ఇక చెన్నై స్టేడియంలో మూడోసారి కావడం మరో విశేషం.
అయినప్పటికీ ఇంగ్లండ్ 419 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బర్న్స్, సిబ్లే, స్టోక్స్, డొమినిక్ బెస్, జోఫ్రా ఆర్చర్, అండర్సన్ వికెట్లను అశ్విన్ సాధించాడు. ఇక నదీమ్‌కు రెండు వికెట్లు లభించగా, ఇషాంత్, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగులు చేయగా, టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ జో రూట్ 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ చేసిన పరుగులే అత్యధిక స్కోరుగా నిలిచింది. ఆ తర్వాత ఓలీ పాప్(28), బెస్(25), బట్లర్(24)లు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్లు.
ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (15), చేటేశ్వర్ పుజారా (12) ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 381 కొట్టాలి. చివరి రోజు ఇన్ని పరుగులు చేయడం దాదాపు అసాధ్యం. మరో రోజు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ 9 వికెట్ల కోసం చూస్తోంది. మరోసారి టీమిండియా అద్భుతం సృష్టిస్తోందో లేదో వేచి చూడాలి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.