INDIA VS ENGLAND DAY 4 RISHABH PANT COMPLETES A BRILLIANT STUMPING TO DISMISS DAN LAWRENCE IN SPIDER MAN STYLE SRD
India vs England : స్పైడర్ మ్యాన్ స్టైల్ లో రిషభ్ పంత్ సూపర్ స్టంపింగ్..వైరల్ వీడియో
Photo Credit : Twitter
India vs England : చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా పట్టుబిగిస్తోంది. విజయం వైపు అడుగులు వేస్తోంది. కేవలం మూడు వికెట్ల దూరంలో ఉంది. లంచ్ ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి, ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే, టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ స్పైడర్ మ్యాన్ స్టైల్ లో సూపర్ స్టంపింగ్‌తో అదరగొట్టాడు.
చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా పట్టుబిగిస్తోంది. విజయం వైపు అడుగులు వేస్తోంది. కేవలం మూడు వికెట్ల దూరంలో ఉంది. లంచ్ ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి, ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే,టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ స్పైడర్ మ్యాన్ స్టైల్ లో సూపర్ స్టంపింగ్‌తో అదరగొట్టాడు. నాలుగోరోజు ఆట ప్రారంభమైన రెండో ఓవర్లోనే పంత్ మెరుపువేగంతో లారెన్స్‌ను అవుట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్ మొదటి బంతిని షాట్ ఆడేందుకు లారెన్స్ క్రీజు దాటి ముందుకు వచ్చాడు. అయితే బంతి లారెన్స్‌ను దాటి కీపర్ పంత్ చేతుల్లో పడింది. అప్పటికే లారెన్స్ క్రీజుకు చాలా దూరంలో ఉండడంతో మెరుపు వేగంతో డైవ్ చేసిన పంత్ బెయిల్స్‌ను ఎగురగొట్టాడు.లారెన్స్ కనీసం బ్యాట్‌ను పెట్టే అవకాశం కూడా ఇవ్వలేదు... అంతేగాక పంత్ స్టంపింగ్‌తో అంపైర్ నిర్ణయం కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా రాలేదు. మొత్తానికి టీమిండియా నాలుగోరోజు ఆట ప్రారంభంలోనే వికెట్‌తో బోణి కొట్టింది.
482 పరుగులు భారీ లక్ష్య చేదనలో ఇంగ్లండ్ ఇప్పటికే ఏడు వికెట్లు కోల్పోగా.. టీమిండియా విజయానికి మాత్రం 3 వికెట్లు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ 7 వికెట్లకు 116 పరుగులు చేసింది.ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక ఇదే టెస్ట్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఫస్ట్ టెస్ట్‌లో క్యాచ్‌లు నేలపాలు చేసి విమర్శలు ఎదుర్కొన్న ఈ యువ వికెట్ కీపర్.. సెకండ్ టెస్ట్‌లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ముందుగా బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో తన ఫామ్‌ను కొనసాగించిన ఈ డాషింగ్ ప్లేయర్.. కీపింగ్‌లోనూ మైమరిపిస్తున్నాడు.