• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND ASHWIN IN VIJAYS MASTER LOOK OFF SPINNER WIFE PRITHIS TWEET GOES VIRAL

India vs England : దళపతి విజయ్ లుక్ లో టాప్ స్పిన్నర్.. వైరలవుతున్న అశ్విన్ భార్య ట్వీట్

India vs England : దళపతి విజయ్ లుక్ లో టాప్ స్పిన్నర్.. వైరలవుతున్న అశ్విన్ భార్య ట్వీట్

Photo Credit : Twitter

India vs England : చెన్నై వేదిక గా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. 317 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసింది కోహ్లీ సేన. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ అల్లాడిపోయారు. అయితే ఈరోజు రెండో టెస్టు లో భారత్ విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించినవారిలో ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకరు.

  • Share this:
    చెన్నై వేదిక గా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. 317 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసింది కోహ్లీ సేన. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ అల్లాడిపోయారు. అయితే ఈరోజు రెండో టెస్టు లో భారత్ విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించినవారిలో ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. తన సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో అశ్విన్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు.తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పనిపడితే.. రెండో ఇన్నింగ్స్ లో కీలక సమయంలో ఏకంగా సెంచరీ చేసి భారత్ రెండో టెస్టు గెలుపుకు బాటలు వేశాడు. దీంతో అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఈ నేపథ్యంలో అశ్విన్ భార్య ప్రీతి అశ్విన్ చేసిన ఓ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన తాజా సినిమా మాస్టర్ పోస్టర్ ను ఎవరో మార్పింగ్ చేసి విజయ్ ప్లేస్ లో అశ్విన్ ఫోటోను అతికించారు. ఆ ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన ప్రీతి .. ఇలా ఎవరు చేశారు అంటూ ఓ స్మైలీ ఎమోజీని యాడ్ చేసింది.

    ఇక, చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అదరగొడుతున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాటు, బంతితో ఇంగ్లీష్ ఆటగాళ్లను ఆటాడిస్తున్న అతడిని ఫాన్స్, మాజీలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. కష్టతరమైన పిచ్‌పై బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎలా చేయాలో అశ్విన్ స్వయంగా చూపిస్తున్నాడని అంటున్నారు. ఇక అశ్విన్ సతీమణి ప్రీతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "చెప్పేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మ్యాచ్‌ను చుట్టేసెయ్‌" అని ఓ ట్వీట్ చేశారు.




    మూడో రోజు ఆటలో యాష్ శతకం సాధించిన విషయం తెలిసిందే. సెంచరీ అనంతరం కూడా ప్రీతి స్పందించారు. 'అశ్విన్‌ ఇప్పుడందర్నీ ట్రోల్‌ చేస్తున్నాడు' అంటూ లాఫింగ్‌ ఎమోజీతో ట్వీట్‌ చేశారు. అశ్విన్‌ ప్రదర్శనపై విమర్శలు గుప్పించేవారికి పరోక్షంగా ఆమె చురకలు అంటించారు.
    Published by:Sridhar Reddy
    First published: