INDIA VS ENGLAND ASHWIN CRYPTIC TWEET RELATED TO YUVRAJ SINGH VERDICT ON MOTERA SURFACE SRD
India vs England : యువరాజ్ పై ఆ విషయంలో అశ్విన్ గుస్సా..పరోక్షంగా యువీపై సెటైర్లు...
యువరాజ్ పై ఆ విషయంలో అశ్విన్ గుస్సా..పరోక్షంగా యువీపై సెటైర్లు...
India vs England : కొత్త స్టేడియంలో స్పిన్నర్ల బంతులు సుడులు తిరిగాయి. బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశాయి. స్పిన్ది మాయో లేదంటే పిచ్‌దే మంత్రమో కానీ మ్యాచ్ అయితే రెండు రోజులు కూడా పూర్తిగా జరగముందే ఫలితం వచ్చింది.
కొత్త స్టేడియంలో స్పిన్నర్ల బంతులు సుడులు తిరిగాయి. బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశాయి. స్పిన్ది మాయో లేదంటే పిచ్‌దే మంత్రమో కానీ మ్యాచ్ అయితే రెండు రోజులు కూడా పూర్తిగా జరగముందే ఫలితం వచ్చింది. గిరగిరా తిరిగే బంతులకు ఇరు జట్లు దాసోహమనగా...చివరికి టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సిరీస్ లో 2-1తో ముందడుగు వేసింది. టెస్టు క్రికెట్ అత్యంత తక్కువ బాల్స్‌లోనే మ్యాచ్ ముగియడం చరిత్రలో ఏడోసారి మాత్రమే. అయితే రెండు రోజుల్లోనే టెస్ట్ ముగియడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఆరోపణలు గుప్పించారు. ఈ లిస్ట్ లో సిక్సర్ల కింగ్ యువరాజ్ కూడా ఉన్నాడు. ఇలాంటి వికెట్‌పై ఆడితే దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ టెస్ట్‌ల్లో వరుసగా 1000, 800 వికెట్లు సులువుగా తీసేవారని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. "రెండు రోజుల్లోనే ఫలితం రావడం టెస్ట్ క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఈ వికెట్‌పై అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఆడితే వరుసగా 1000, 800 వికెట్లు తీసేవారు. ఏది ఏమైనా అద్భుత ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్‌కు 400 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌కు.. 100వ మ్యాచ్ ఆడిన ఇషాంత్‌కు అభినందనలు" అని పేర్కొన్నాడు. అయితే ఈ విమర్శలపై రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. ఏ మాత్రం అర్థం కానీ భాషలో వరుస ట్వీట్లతో మాజీ క్రికెటర్లపై మండిపడ్డాడు. కోడింగ్ భాషలో ఉన్న అశ్విన్ ట్వీట్స్‌లో ఉన్న అర్థాన్ని అభిమానులు డీకోడ్ చేస్తున్నారు.
"వివిధ మార్కెటింగ్ వ్యూహాల కారణంగానే ఉత్పత్తులు అమ్ముడవుతాయి. పైగా ఇది అమోదించబడిన పద్దతి. మనం ఇప్పుడు ఆలోచనలను కూడా అమ్ముతున్న యుగంలో జీవిస్తున్నాం. ఆలోచలను అమ్మడం ఔట్‌బౌండ్ మార్కెటింగ్‌కు సరైన ఉదాహరణ. అయితే మనకు అమ్మిన ఆలోచనలను కొనడం అంటే మనకు చెప్పడం లాంటిదేనని నా అభిప్రాయం"అని ట్వీట్ చేశాడు. మరో రెండు ట్వీట్లను కూడా ఈ తరహాలోనే రాసుకొచ్చాడు. అయితే ఈ ట్వీట్స్ నేరుగా చదివితే ఎవరికి అర్థం కావడం లేదు. కానీ అశ్విన్ మాజీ క్రికెటర్లను ఉద్దేశించే పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.
Products are sold using various marketing strategies and that’s an accepted practice! We now live in an era where ideas are also being sold to us and it’s a classic example of “outbound marketing”, however I would like to add that buying ideas being sold to us is like telling us
యువీ కామెంట్లకు అనుగుణంగా అశ్విన్ ఈ విధంగా స్పందించి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పిచ్‌ను సాకుగా చూపి, 72 టెస్టుల్లోనే 400 వికెట్లు తీసిన అశ్విన్ ప్రతిభను తక్కువ చేసి చూపడం సరికాదని హితవు పలుకుతున్నారు. అయితే ఆ ట్వీట్ల వెనుక ఆంతర్యం ఏమిటో అశ్విన్‌కు మాత్రమే తెలియాలి. ప్రస్తుతం అశ్విన్ చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.