• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • INDIA VS ENGLAND 4TH T20I LIVE UPDATES ITS ALL OVER KOHLIS TEAM WON BY 8 RUNS SRD

India vs England : నాలుగో టీ-20 టీమిండియాదే...ఉత్కంఠ పోరులో విక్టరీ కొట్టిన కోహ్లీసేన

నాలుగో టీ-20 టీమిండియాదే...ఉత్కంఠ పోరులో విక్టరీ కొట్టిన కోహ్లీసేన

India vs England : టీమిండియా- ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఛేజింగ్ జట్టే గెలుస్తుందనే నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది.

  • Share this:
    టీమిండియా- ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఛేజింగ్ జట్టే గెలుస్తుందనే నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. . ఉత్కంఠగా సాగిన పోరులో 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా. దీంతో 2-2 తో సిరీస్ ను సమం చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ల లో బెన్ స్టోక్స్ 23 బంతుల్లో 46 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ మెరుపులు మెరిపించడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. ఆఖరి ఓవర్ లో 23 పరుగులు అవసరమవ్వగా ఫస్ట్ మూడు బంతుల్లో 13 పరుగులు ఇచ్చి టెన్షన్ పెట్టాడు శార్దూల్ ఠాకూర్. అయితే లాస్ట్ మూడు బంతులు కట్టదిట్టంగా వేయడంతో టీమిండియా విక్టరీ అందుకుంది. దీంతో 5 మ్యాచ్‌ల సరీస్‌ 2-2 సమం అయింది. చివరి టీ20 మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. ఈ నెల 20న భారత్‌- ఇంగ్లండ్‌ల మధ్య చివరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ మూడు వికెట్లతో సత్తా చాటగా..రాహుల్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

    అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. రోహిత్, రాహుల్, కోహ్లీ నిరాశపరిచారు. అయితే యంగ్ గన్స్.. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) సూపర్ ఫిఫ్టీకి.. రిషభ్ పంత్(23 బంతుల్లో 4 ఫోర్లతో 30), శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 37)ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఇంగ్లండ్ ముందు భారత్ 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

    ప్రత్యర్థి బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్, సామ్ కరన్ తలో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.
    Published by:Sridhar Reddy
    First published: