• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • INDIA VS ENGLAND 4TH T20 LIVE UPDATES MORGAN WON THE TOSS AND ELECTED FIELD FIRST SRD

India vs England : మరోసారి టాస్ ఓడిన టీమిండియా..రెండు కీలక మార్పులు చేసిన కోహ్లీసేన..

మరోసారి టాస్ ఓడిన టీమిండియా..రెండు కీలక మార్పులు చేసిన కోహ్లీసేన..

India vs England : ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇక, ఈ రోజు జరుగుతున్న నాలుగో టీ-20 మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా బ్యాటింగ్ కు దిగనుంది కోహ్లీసేన.

  • Share this:
    ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇక, ఈ రోజు జరుగుతున్న నాలుగో టీ-20 మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా బ్యాటింగ్ కు దిగనుంది కోహ్లీసేన. ఈ మ్యాచ్ లో రెండు కీలక మార్పులు చేసింది భారత్. చాహల్, ఇషాన్ కిషన్ ల్ని తప్పించిన టీమిండియా..సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్ లకు చోటు కల్పించింది. మరోవైపు, ఇంగ్లండ్ మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ అధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20లో సునాయసంగా గెలుపొందిన భారత్‌ మళ్లీ మూడో మ్యాచ్‌లో తడబడింది. మొదటి మ్యాచ్‌లో విఫలమైన బ్యాట్స్‌మన్‌ మరోసారి మూడో టీ20లోనూ తడబడడంతో టీమిండియా ఓటమిని చవి చూడాల్సివచ్చింది. ఇక, మొతేరాలో ఈరోజు జరగనున్న నాలుగో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.

    India (Playing XI): Rohit Sharma, KL Rahul, Virat Kohli(c), Suryakumar Yadav, Rishabh Pant(w), Shreyas Iyer, Hardik Pandya, Washington Sundar, Shardul Thakur, Bhuvneshwar Kumar, Rahul Chahar

    England (Playing XI): Jason Roy, Jos Buttler(w), Dawid Malan, Jonny Bairstow, Eoin Morgan(c), Ben Stokes, Sam Curran, Chris Jordan, Jofra Archer, Adil Rashid, Mark Wood

    5 టీ20ల సీరిస్‌లో ఇప్పటికే ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం సిరీస్‌ చేజారుతుంది. దీంతో సమిష్టిగా ఆడి సిరీస్ ను సమం చేయాలని కోహ్లీసేన గట్టిగా ప్రయత్నిస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published: