• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • INDIA VS ENGLAND 3RD T20 LIVE UPDATES ENGLAND WON THE TOSS AND OPT TO BOWL SRD

India vs England : టాస్ ఓడిన టీమిండియా.. రోహిత్ శర్మ ఇన్..సూర్యకుమార్ యాదవ్ ఔట్..

India vs England

India vs England : టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరగనున్న మూడో టీ20లో మోర్గాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందు బ్యాటింగ్ కు దిగనుంది.

  • Share this:
    టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరగనున్న మూడో టీ20లో మోర్గాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందు బ్యాటింగ్ కు దిగనుంది. అయితే ఆశ్చర్యకరంగా సూర్య కుమార్ ను తప్పించి రోహిత్ కు చోటు కల్పించింది టీమిండియా. రెండో టీ-20లో చోటు దక్కించుకున్న సూర్య కుమార్ యాదవ్ కు బ్యాటింగ్ దిగే అవకాశం రాలేదు. కానీ, జట్టులో నుంచి తప్పించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే, రోహిత్ శర్మ రాకతో టీమిండియా బ్యాటింగ్ స్ట్రాంగ్ గా మారింది. మరోవైపు, ఇంగ్లండ్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. టామ్ కర్రన్ స్థానంలో మార్క్ వుడ్ కి చోటు కల్పించింది. ఇక, తొలి టీ20లో ఓటమికి భారత జట్టు గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో చెలరేగి పర్యాటక ఇంగ్లండ్‌కు ఝలక్‌ ఇచ్చింది. పటిష్ఠమైన రిజర్వ్‌ బలంతో ఉన్న టీమిండియా యువ ఆటగాళ్లను పరీక్షిస్తూ సత్ఫలితాలనే అందుకుంటోంది. నేటి మ్యాచ్‌లోనూ కోహ్లీ సేన పైచేయి సాధిస్తే.. నెంబర్‌వన్‌ ఇంగ్లండ్‌ మరింత ఒత్తిడిలో పడుతుంది.

    ఆదివారం మ్యాచ్‌లో చిత్తయిన తీరుతో ఇంగ్లండ్‌ ఆత్మపరిశీలనలో పడింది. ఆరంభంలో వారు ఆడిన తీరు చూస్తే స్కోరు సులువుగా 190 చేరుతుందనిపించింది. కానీ స్లో బంతులను ఆడడంలో విఫలమ వడం వారి స్కోరుపై ప్రభావం చూపింది. డెత్‌ ఓవర్లలోనూ బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. ఈ ఫార్మాట్‌లో నెంబర్‌వన్‌ డేవిడ్‌ మలాన్‌పై ఉన్న భారీ అంచనాలను ఇప్పటి దాకా అతను అందుకోలేకపోయాడు. పవర్‌ప్లేలో అతడు నిదానంగా ఆడడం జట్టు ఫలితంపై పడింది. స్టోక్స్‌ కూడా బ్యాటింగ్‌లో నిరాశపరుస్తున్నాడు. జేసన్‌ రాయ్‌ మాత్రమే దూకుడుగా వెళుతున్నాడు. లెఫ్ట్‌ హ్యాండర్లు ఇషాన్‌, పంత్‌లను కట్టడి చేసేందుకు టామ్‌ కర్రాన్‌ స్థానంలో స్పిన్నర్‌ మొయిన్‌ అలీని ఆడించే ఆలోచనలో కెప్టెన్‌ మోర్గాన్‌ ఉన్నాడు.

    India (Playing XI): Rohit Sharma, KL Rahul, Ishan Kishan, Virat Kohli(c), Rishabh Pant(w), Shreyas Iyer, Hardik Pandya, Washington Sundar, Shardul Thakur, Bhuvneshwar Kumar, Yuzvendra Chahal

    England (Playing XI): Jason Roy, Jos Buttler(w), Dawid Malan, Jonny Bairstow, Eoin Morgan(c), Ben Stokes, Sam Curran, Chris Jordan, Jofra Archer, Adil Rashid, Mark Wood
    Published by:Sridhar Reddy
    First published: