• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • INDIA VS ENGLAND 3RD T20 ENGLAND CRUSH INDIA BY 8 WICKETS TAKE 2 1 LEAD SA

ఇలా ఆడితే వరల్డ్ కప్ ఏం గెలుస్తారు.. ప్రతర్థి పేస్ దాటికి బారత్ బౌల్డ్!

India vs England

మంగళవారం మూడో టి20లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (83) బెయిర్‌ స్టో(40) ఇన్నింగ్స్‌ తో ఇంగ్లండ్‌ జట్టు

  • Share this:
    రెండో టీ20 గెలుపుతో భారత్ ఫామ్‌లో వచ్చి్ందిని అభిమానులు సంబరపడిన వేళ తాజా ఓటమితో మరోసారి నిరాశపరిచింది. టీమిండియా మూడో టీ20లో బ్యాటింగ్‌ వైఫల్యం చెంది ఇంగ్లాండ్ గెలుపును అప్పజేప్పింది. ఇంగ్లీష్ పేసర్ మార్క్‌ వుడ్‌ వేగానికి భారత్ బ్యాట్స్‌మెన్స్ తలవంచారు. సారథి కోహ్లి మాత్రం ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదురుకుని జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. ఇక భారత్ నిర్థేశించిన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించింది. పసలేని బౌలింగ్‌, పేలవ ఫీల్డింగ్‌ ప్రతర్థి లక్ష్యాన్ని వేగంగా అందుకునేలా తోడ్పాడ్డాయి . ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

    మంగళవారం మూడో టి20లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (83) బెయిర్‌ స్టో(40) ఇన్నింగ్స్‌ తో ఇంగ్లండ్‌ జట్టు 18.2 ఓవర్లలో భారత్‌ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. భారత బౌలర్లలో చహల్‌, సుందర్‌లకు తలో వికెట్‌ దక్కింది. దీంతో 5 టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

    టాస్ గెలిచి తొలిత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి (46 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్ కారణంగా భారత్ ఆ మాత్రం స్కోర్‌నైనా సాధించగలిగింది. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ సూపర్ బౌలింగ్‌తో 3 వికెట్లు సాధించాడు.
    మెుదటి టీ20 మాదిరిగానే మూడు టీ20లో టిమిండియా బ్యాటిండ్ కొనసాగింది.

    తొలి 15 ఓవర్ల వరకు బంతికో పరుగు కూడా చేయలేకపోయింది. జట్టు చివరి 5 ఓవర్లలో చెలరేగింది. ఆరంభంలో భారత్‌ను దెబ్బ తీయడంలో పేసర్‌ మార్క్‌ వుడ్‌ కీలకపాత్ర పోషించాడు. మరోసారి తొలి ఓవర్లోనే రాహుల్‌ (0) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానంలో వచ్చిన స్టార్ ఆటగాడు రోహిత్‌ శర్మ (15; 2 ఫోర్లు) కూడా నిరాశపరిచాడు. గత మ్యాచ్‌ హీరో ఇషాన్‌ కిషన్‌ (4)ను జోర్డాన్‌ అవుట్‌ చేశాడు. దీంతో బారత్ 6 ఓవర్లలోనే 24 పరుగులు చేసి భారత్‌ 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత పంత్‌ (20 బంతుల్లో 25; 3 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. అనుహ్యంగా రనౌటయ్యాడు. అయ్యర్‌ (9) భారీ షాట్‌కు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది.

    15 ఓవర్ల తర్వాత భారత కెప్టెన్‌ అద్భుత షాట్‌లతో విరుచుకుపడ్డాడు. అప్పటివరకు జట్టు స్కోరు 87 పరుగులే ఉండగా మెరుపు బ్యాటింగ్‌‌తో గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. అతనికి హార్థిక్ పాండ్యా(17) సహాకరించాడు.
    Published by:Rekulapally Saichand
    First published: