• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND 2ND TEST RAVICHANDRAN ASHWIN OPEN ABOUT TEAM INDIA WIN SA

మా నాన్నతో కలిసి ఏ స్టాండ్స్‌లో అయితే మ్యాచ్ చూశానో...

మా నాన్నతో  కలిసి  ఏ  స్టాండ్స్‌లో అయితే  మ్యాచ్ చూశానో...

Ravichandran Ashwin

టీమిండియా స్పిన్నర్ల దెబ్బకి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ అల్లాడిపోయారు. ఆఖర్లో మొయిన్ అలీ మెరుపులు తప్ప ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. అక్షర్ పటేల్ ఐదు వికెట్లు తో చెలరేగగా

  • Share this:
    మెుదటి టెస్ట్ ఓటమికి స్రతికారం తీర్చుకున్నారు. చెన్నై టెస్ట్‌ను విజయంతో ముగించారు. తాజా విజయంతో 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1–1తో సమం చేసింది టీమిండియా. తొలి టెస్ట్‌లో టీమిండియాను ఓడించిన పర్యటక జట్టు ఈ సారి ఓటమి తన సంచన చేరింది. కరోనా నేపథ్యంలో ఎన్నో అనుమానులు నెలకొన్న వేళ చెన్నైలో రెండు దిగ్విజయంగా ముగిసింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఇంగ్లండ్‌ తలవంచడంతో టెస్టు సిరీస్‌ 1–1తో సమమైంది. గాయం కారణంగా తొలి టెస్టు ఆడని అక్షర్‌ ఈ రెండు టెస్ట్‌లో రెచ్చిపోయాడు. ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు.

    టీమిండియా స్పిన్నర్ల దెబ్బకి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ అల్లాడిపోయారు. ఆఖర్లో మొయిన్ అలీ మెరుపులు తప్ప ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. అక్షర్ పటేల్ ఐదు వికెట్లు తో చెలరేగగా.. అశ్విన్ మూడు, కుల్దీప్ రెండు వికెట్లు తీశారు. 482 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. 53 పరుగుల తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ను టీమిండియా స్పిన్నర్లు కోలుకోలేని దెబ్బ తీశారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశారు. రూట్ కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. 33 పరుగులు చేసిన రూట్.. అక్షర్ పటేల్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. అయితే, ఆఖర్లో మొయిన్ అలీ తన బ్యాట్ కు పని చెప్పాడు. ధాటి ఆడుతూ.. సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 18 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఐదు సిక్సర్లు ఉన్నాయ్. అయితే, చివరికి కుల్దీప్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించబోయి స్టంప్ ఔట్ అయ్యాడు అలీ.

    నిన్న 52/1 స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్(148 బంతుల్లో 14 ఫోర్లు ఒక సిక్స్‌తో 106) వీరోచిత సెంచరీ‌కి తోడు విరాట్ కోహ్లీ(149 బంతుల్లో 7 ఫోర్లతో 62) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌‌తో రాణించాడు. చివర్లో సిరాజ్(16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్(4/100), మొయిన్ అలీ(4/98) నాలుగేసి వికెట్లు తీయగా.. ఓలి స్టోన్(1/21) ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లండ్‌కు టీమిండియా 482 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

    రెండో మ్యాచ్ హీరోగా నిలిచిన ఆశ్విన్ మ్యా్చ్ విజయంపై స్పందించారు. ‘మా నాన్నతో వచ్చి ఇక్కడి స్టాండ్స్‌లో ఎన్నో మ్యాచ్‌లు చూశాను. నేను ఈ మైదానంలో ఇప్పటివరకు నాలుగు టెస్టుల్లో ఆడాను.అన్నింటికంటే నాకిదే ప్రత్యేకం. నాకు ప్రేక్షకుల నుంచి చాలా మద్దతు లభించింది. బ్యాటింగ్‌కు చేసినా, బౌలింగ్‌కు దిగినా వారు ఎంతో ప్రోత్సాహించారు. ఈ విజయంపై నాకు మాటలు రావడం లేదు. నేనిప్పుడు హీరోననే భావం నాలో కలుగుతోంది. ఇక ఈ విజయం చెన్నై ప్రేక్షకులకు అంకితం చేస్తాను’ అన్నారు.



    అహ్మదాబాద్‌లో జరిగే ‘పింక్‌ టెస్టు’ సవాల్‌కు మరింత ఉత్సాహంతో సిద్ధమైంది.
    Published by:Rekulapally Saichand
    First published: