• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND 2ND ODI LIVE UPDATES TEAM INDIA POST A BIG TOTAL 6 FOR 336 SRD

India vs England : రాహుల్ క్లాసిక్ సెంచరీ..పంత్, హార్దిక్ మెరుపులు..ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..

India vs England : రాహుల్ క్లాసిక్ సెంచరీ..పంత్, హార్దిక్ మెరుపులు..ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..

Photo Credit : Twitter

India vs England : పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కు భారీ టార్గెట్ ను సెట్ చేసింది టీమిండియా. టీమిండియా బ్యాట్స్ మెన్లలో రాహుల్, కోహ్లీ, పంత్, హార్ధిక్ సత్తా చాటారు. ముఖ్యంగా రాహుల్ సెంచరీతో దుమ్ము రేపాడు.

  • Share this:
    పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కు భారీ టార్గెట్ ను సెట్ చేసింది టీమిండియా. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఇంగ్లండ్ టీమ్ ఈ మ్యాచ్ లో గెలవాలంటే 337 పరుగులు చేయాలి. టీమిండియా బ్యాట్స్ మెన్లలో రాహుల్, కోహ్లీ, పంత్, హార్ధిక్ సత్తా చాటారు. ముఖ్యంగా రాహుల్ సెంచరీతో దుమ్ము రేపాడు. ఈ కర్ణాటక యంగ్ బ్యాట్సమన్ 114 బంతుల్లో 108 పరుగులతో సత్తా చాటాడు. ఆఖర్లో వేగంగా స్కోరు చేసే ప్రయత్నంలో టామ్ కర్రన్ బౌలింగ్ లో అవుటయ్యాడు రాహుల్. ఇక, పంత్ హైలెట్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా కూడా తన బ్యాట్ కు పని చెప్పడంతో టీమిండియా భారీ టార్గెట్ ను సెట్ చేసింది. రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. గత మ్యాచ్ లో రాణించిన శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో తక్కువ స్కోరుకు ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌ ఐదో బంతికి గబ్బర్ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రీస్ టోప్లీ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 9 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది.

    ఆ తర్వాత వరుస బౌండరీలతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ, అనవసరపు షాట్ తో రషీద్ చిక్కి పెవిలియన్ బాట పట్టాడు.రోహిత్‌ 25 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దాంతో 37 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ, రాహుల్ కలిసి ఇన్నింగ్స్ ని చక్క దిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్ కు సెంచరీకి పైగా పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సిక్స్ బాదిన కోహ్లీ.. 66 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఔట‌య్యాడు. ర‌షీద్ బౌలింగ్‌లో కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔట‌య్యాడు.


    ఇక ఆఖర్లో.. రాహుల్ తో కలిసిన పంత్ వీర బాదుడు బాదాడు. దొరికిన బంతిని బౌండరీకి తరలించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో రాహుల్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో సెంచరీ తర్వాత రాహుల్ ఔటయ్యాడు. ఆ తర్వాత పంత్ కూడా టామ్ కర్రన్ బౌలింగ్ రాయ్ చేతికి క్యాచ్ ఇచ్చిన ఔటయ్యాడు. పంత్ ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు ఉన్నాయ్. ఆఖర్లో పాండ్యా 16 బంతుల్లో 35 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టోప్లీ, కర్రన్ చెరో రెండు వికెట్లు తీశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు