• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND 2ND ODI LIVE UPDATES ENGLAND WON BY 6 WICKETS AND LEVEL THE SERIES SRD

India vs England : రెండో వన్డే ఇంగ్లండ్ దే.. చేతులేత్తేసిన టీమిండియా బౌలర్లు..

India vs England : రెండో వన్డే ఇంగ్లండ్ దే.. చేతులేత్తేసిన టీమిండియా బౌలర్లు..

Photo Credit : Twitter

India vs England : మూడు వన్డే మ్యాచుల సిరీసులో భాగంగా పుణే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 337 పరుగుల భారీ టార్గెట్ ను మరో 39 బంతులు మిగిలుండగానే అందుకుంది ఇంగ్లండ్.

  • Share this:
    మూడు వన్డే మ్యాచుల సిరీసులో భాగంగా పుణే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 337 పరుగుల భారీ టార్గెట్ ను మరో 39 బంతులు మిగిలుండగానే అందుకుంది ఇంగ్లండ్. జానీ బెయిర్ స్టో (Bairstow) సూపర్ సెంచరీతో చెలరేగగా..బెన్ స్టోక్స్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. జానీ బెయిర్ స్టో 112 బంతుల్లో 124 పరుగులు చేయగా.. బెన్ స్టోక్స్ 52 బంతుల్లో 99 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా..భువనేశ్వర్ ఒక వికెట్ ను దక్కించుకున్నాడు. స్పిన్నర్లు కుల్దీప్, కృనాల్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫస్ట్ వన్డే లో టీమిండియా గెలుపొందగా..రెండో గేమ్ ను ఇంగ్లండ్ దక్కించుకోవడంతో సిరీస్ 1-1 సమంగా నిలిచింది. ఆదివారం జరగనున్న మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటోంది. 337 పరుగుల భారీ టార్గెట్ తో ఛేజింగ్ ను ప్రారంభించిన ఇంగ్లండ్ కు ఓపెనర్లు మరో సారి గ్రేట్ స్టార్ట్ ని అందించారు. జేసన్ రాయ్, బెయిర్ స్టో ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు 110 పరుగుల పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. జాసన్ రాయ్ (52 బంతుల్లో 55: 7 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది

    ఆ తర్వాత బెయిర్ స్టో తో కలిసిన బెన్ స్టోక్స్ (Ben Stokes) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్లను టార్గెట్ చేశాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన 31వ ఓవర్ మొదటి బంతికి సిక్సర్ బాదిన బెయిర్‌స్టో.. వన్డేల్లో 11వ సెంచరీ నమోదు చేశాడు. 95 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో సెంచరీ చేశాడు. మరోవైపు బెన్ స్టోక్స్ 40 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు. ఠాకూర్ వేసిన 32వ ఓవర్ మూడో బంతికి సింగల్ తీసి ఫిఫ్టీ మార్క్ చేరాడు. హాఫ్ సెంచరీ తర్వాత బెన్ స్టోక్స్ వరుస సిక్సులతో రెచ్చిపోయాడు. కుల్దీప్ వేసిన 33వ ఓవర్లో స్టోక్స్ వరుసగా మూడు సిక్సర్లు బాదేశాడు. కృనాల్‌ వేసిన 34 ఓవర్లో 3 సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. ఆ రెండు ఓవర్ల దెబ్బకి టీమిండియా ఓటమి ఖాయమైంది.


    అయితే, వరుసగా బెయిర్ స్టో, స్టోక్స్, బట్లర్ ఔట్ అవ్వడంతో టీమిండియా శిబిరంలో ఆశలు చిగురించాయ్. అయితే, డేవిడ్ మలన్, లివింగ్ స్టోన్ మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ఫినిష్ చేశారు. లివింగ్ స్టోన్ 21 బంతుల్లో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మూడో మ్యాచ్ ఆదివారం పుణె వేదికగానే జరగనుంది.
    Published by:Sridhar Reddy
    First published: