• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS ENGLAND 2ND ODI LIVE UPDATES BEN STOKES GETS WARNING FROM UMPIRE AFTER APPLYING SALIVA ON BALL SRD

India vs England : రెండో వన్డేలో ఆ పని చేస్తూ అంపైర్ కి చిక్కిన బెన్ స్టోక్స్..ఏం చేశాడో తెలుసా..

India vs England : రెండో వన్డేలో ఆ పని చేస్తూ అంపైర్ కి చిక్కిన బెన్ స్టోక్స్..ఏం చేశాడో తెలుసా..

Photo Credit : Ben Stokes

India vs England : పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్ సత్తా చాటుతున్నారు. రాహుల్, పంత్ మెరుపులతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. అయితే, ఈ మ్యాచ్ లో ఆ పని చేస్తూ ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) అంపైర్ చేతికి చిక్కాడు. దీంతో బెన్ స్టోక్స్ కి అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు.

  • Share this:
    పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్ సత్తా చాటుతున్నారు. రాహుల్, పంత్ మెరుపులతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. అయితే, ఈ మ్యాచ్ లో ఆ పని చేస్తూ ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) అంపైర్ చేతికి చిక్కాడు. దీంతో బెన్ స్టోక్స్ కి అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. వివరాల్లోకెళితే.. ఈ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ సెలైవా ఉపయోగించాడు. ఐసీసీ (ICC) రూల్స్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో సెలైవా ఉపయోగించడం నిషేధం. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ అతిక్రమిస్తే మొదటిసారి హెచ్చరిస్తారు. రెండోసారి కూడా ఇలానే చేస్తే ఆ ఆటగాడు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టుకు ఐదు పరుగుల జరిమానా విధిస్తారు. బంతిని షైన్‌చేసే క్రమంలో బౌలర్లు లాలాజలం(సెలైవా) ఉపయోగిస్తారు. కరోనా (Corona) వైరస్ ఎఫెక్ట్ తో ఈ రూల్ పై ఇంకా నిబంధనలు ఇంకా కొనసాగుతున్నాయి. టీమిండియా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ రెండో బంతి వేసిన తర్వాత బాల్‌ను తీసుకున్న స్టోక్స్‌ సెలైవా అప్లై చేశాడు. దీంతో అంపైర్‌ వీరేందర్‌ శర్మ అతడికి వార్నింగ్‌ ఇచ్చాడు. అంతేగాక విషయాన్ని తాత్కాలిక కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌కు తెలియజేశాడు.

    అయితే, ఈ ఘటన తర్వాత బంతి శానిటైజ్ చేశారు అంపైర్లుఇక టీమిండియా ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. మొదటి వన్డేలో భుజం గాయంతో సిరీస్‌ నుంచి వైదొలిగిన శ్రెయాస్‌ అయ్యర్‌ స్థానంలో రిషబ్‌ పంత్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌ మోర్గాన్‌ గాయంతో మిగిలిన రెండు వన్డేలకు దూరమవడంతో అతని స్థానంలో జాస్‌ బట్లర్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.

    ఇక, ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ కర్ణాటక యంగ్ బ్యాట్సమన్ 114 బంతుల్లో 108 పరుగులతో సత్తా చాటాడు. ఆఖర్లో వేగంగా స్కోరు చేసే ప్రయత్నంలో టామ్ కర్రన్ బౌలింగ్ లో అవుటయ్యాడు రాహుల్. మరోవైపు పంత్, హార్దిక్ పాండ్య మెరుపు బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ లో భారీ స్కోరు దిశగా సాగుతోంది టీమిండియా. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 79 బంతుల్లో 66 పరుగులతో రాణించాడు కోహ్లీ.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు