Ind Vs Eng : తగ్గేదే లే... సరికొత్త రికార్డులు సృష్టించిన భారత్ - ఇంగ్లండ్ సిరీస్..

కొహ్లీ, జో రూట్

Ind Vs Eng : టీమిండియా (Team India) ఏ సిరీస్ ఆడినా... ఆ కిక్కే వేరు. టీమిండియాతో ఆడితే చాలు.. ఏ క్రికెట్ (Cricket) బోర్డు అయినా సరే లాభాల్లో నడుస్తోంది. ఇందుకు ఉదాహరణ లేటెస్ట్ గా ముగిసినా.. శ్రీలంక సిరీస్.

 • Share this:
  టీమిండియా (Team India) ఏ సిరీస్ ఆడినా... ఆ కిక్కే వేరు. టీమిండియాతో ఆడితే చాలు.. ఏ క్రికెట్ (Cricket) బోర్డు అయినా సరే లాభాల్లో నడుస్తోంది. ఇందుకు ఉదాహరణ లేటెస్ట్ గా ముగిసినా.. శ్రీలంక సిరీస్. ఆ దేశ క్రికెట్ బోర్డుకు దాదాపు 100 కోట్ల లాభం వచ్చింది ఆ సిరీస్ ద్వారా. ఇక, ఇప్పుడు భారత్ - ఇంగ్లండ్ (India Vs England 2021) సిరీస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ మెగా సిరీస్ కు భారీ ఎత్తున వ్యూయ‌ర్‌షిప్ వ‌స్తోంది. గ‌త మూడేళ్ల‌లో భారత క్రికెట్ టీమ్ ఆడిన‌ విదేశీ ద్వైపాక్షిక సిరీస్‌ల‌లో అత్య‌ధిక వ్యూయ‌ర్‌షిప్ ఈ సిరీస్‌కే వ‌చ్చిన‌ట్లు సోనీ స్పోర్ట్స్ తాజాగా ఓ ప్రకటనలో వెల్ల‌డించింది. ఈ నెల 4న ప్రారంభ‌మైన ఈ సిరీస్‌లో ప్రస్తుతం మూడో టెస్ట్ జ‌రుగుతోంది. మ‌రో రెండు టెస్టులు జ‌ర‌గాల్సి ఉంది. 2018లో భారత్, ఇంగ్లండ్ మ‌ధ్యే జ‌రిగిన సిరీస్ కంటే ఇప్పుడు స‌గ‌టు వ్యూయ‌ర్‌షిప్ 30 శాతం పెరిగిన‌ట్లు సోనీ స్పోర్ట్స్ (Sony Sports) చెప్పుకొచ్చింది. భారీ ఎత్తున వ్యూయ‌ర్‌షిప్ రావడానికి అసలు కారణం లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టే కారణం. అందులోనూ చివ‌రి రోజు ఆట‌కు స‌గ‌టు రేటింగ్స్ 70 శాతం వ‌ర‌కూ పెరిగాయి. భారత్ గెలుస్తుంద‌న్న అంచ‌నాతో ఆ రోజు భారీగా మ్యాచ్‌ను చూశారు. మ్యాచ్ డ్రా అవుతుందనుకున్నా.. అద్భుత బౌలింగ్ కారణంగా భారత్ విజయాన్ని అందుకుంది. చివరి రోజే సుమారు 80 ల‌క్ష‌ల ఇంప్రెష‌న్స్ వ‌చ్చాయని సోనీ స్పోర్ట్స్ తెలిపింది.

  టీమిండియా విదేశాల్లో ఆడిన టెస్ట్ మ్యాచ్ ఒక రోజు వ‌చ్చిన అత్య‌ధిక ఇంప్రెష‌న్స్ (80 ల‌క్ష‌లు) ఇవే. ఆ రోజు చివ‌రి సెష‌న్‌లో ఇంగ్లండ్ 120 ప‌రుగుల‌కే ఆలౌటైన సంద‌ర్భంలో కోటి 7 ల‌క్ష‌ల ఇంప్రెష‌న్స్ వ‌చ్చాయి అని సోనీ స్పోర్ట్స్ చెప్పింది. లార్డ్స్ టెస్ట్‌లో కోహ్లీసేన గెలిచిన త‌ర్వాత సోనీ చానెల్‌కు మ‌రిన్ని బ్రాండ్లు క్యూ క‌ట్ట‌డం విశేషం. ఇప్ప‌టికే ఈ సిరీస్‌కు 12 బ్రాండ్లు స్పాన్స‌ర్లుగా ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీసుకు కూడా భారీ వ్యూయ‌ర్‌షిప్ వచ్చింది. రసవత్తర పోరులో భారత్ అద్భుతంగా ఆడింది.

  ఇది కూడా చదవండి : IPL 2021 సెకండాఫ్‌కి నయా జోష్..! బరిలోకి దిగనున్న కొత్త ఆటగాళ్లు వీళ్లే..! ఫస్ట్ టైం సింగపూర్ ప్లేయర్ కి చోటు..

  ఇక, ఇంగ్లండ్ జట్టు (England Team) తో లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా (Team India) పోరాడుతోంది. ఓటమిని తప్పించుకోవాడానికి టీమిండియా బ్యాట్స్ మెన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించగా.. టీమిండియా వాల్ పుజారా హాఫ్ సెంచరీతో టచ్ లోకి వచ్చాడు. అయితే, 59 పరుగులు చేసిన రోహిత్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి టీమిండియా 151 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా, కోహ్లీ ఉన్నారు. ఇక, అంతకు ముందు 132.2 ఓవర్లు ఆడిన రూట్ సేన ఏకంగా 432 పరుగులు చేసింది. 354 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 423/8తో మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ మరీ ఎక్కువ పరుగులేమీ చేయలేదు. క్రెయిగ్ ఓవర్టన్‌ (32; 42 బంతుల్లో 6×4) మొహ్మద్ షమీ వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో అతడి బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ప్లయిట్ ఓలి రాబిన్సన్‌ (0; 15 బంతుల్లో) పరుగుల ఖాతా తెరవలేదు. జస్ప్రీత్ బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్‌ అయ్యాడు. జేమ్స్ అండర్సన్‌ (0) అజేయంగా నిలిచాడు.
  Published by:Sridhar Reddy
  First published: