India vs England : రిషభ్ పంత్..ఏందయ్యా ఈ అరాచకం.. ఎవరైనా ఇలా ఆడగలరా..(వీడియో)

రిషభ్ పంత్ (Photo Credit : Twitter)

India vs England : అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో జరుగుతున్న ఫస్ట్ టీ-20 లో టీమిండియా ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ టీమ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సాహసోపేత షాట్‌తో క్రికెట్ అభిమానులను సంభ్రమాశ్చర్యాలకి గురిచేశాడు.

  • Share this:
    అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో జరుగుతున్న ఫస్ట్ టీ-20 లో టీమిండియా ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ టీమ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 125 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఓపెనర్లు జాసన్ రాయ్, జోస్ బట్లర్ లు సూపర్ స్టార్ట్ అందించారు. ఫస్ట్ వికెట్ కు వీరిద్దరూ 72 పరుగుల పార్టనర్ షిప్ ను నమోదు చేశారు. జాసన్ రాయ్ 32 బంతుల్లో 49 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరి హిట్టింగ్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. మరో ఓపెనర్ బట్లర్ 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరి ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మలన్, జానీ బెయిర్ స్టో మరో వికెట్ పడకుండా ఇంగ్లండ్ టీమ్ ను విజయతీరాలకు చేర్చారు. దీంతో ఈ సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఇంగ్లండ్ టీమ్. ఇక, టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇటీవల ముగిసిన ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడిన విషయం తెలిసిందే. ఈరోజు మరో స్టార్ పేసర్ జోప్రా ఆర్చర్ బౌలింగ్‌లోనూ సాహసోపేత షాట్‌తో క్రికెట్ అభిమానులను సంభ్రమాశ్చర్యాలకి గురిచేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా మొతేరా స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో పంత్ రివర్స్ ల్యాప్ షాట్ ఆడాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీసీసీఐ అయితే ఇలాంటి షాట్ ఆడొద్దని ఫన్నీగా ట్వీట్ చేసింది.

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. ఎలాంటి ఒత్తిడికి గురవకుండా రివర్స్ లాప్ సిక్స్ బాదేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన జోప్రా ఆర్చర్.. ఐదో బంతిని గుడ్ లెంగ్త్ రూపంలో సంధించాడు. ముందుగానే రివర్స్ స్వీప్‌కి సిద్ధమైపోయిన పంత్.. ఊహించని విధంగా ఆడాడు. గంటకి 140.6 కిమీ వేగంతో దూసుకొచ్చిన బంతిని రివర్స్ స్వీప్ రూపంలో నేరుగా స్టాండ్స్‌లోకి తరలించాడు. స్లిప్ ఫీల్డర్ల మీదగా వెళ్లిన బంతి స్టాండ్స్‌లో పడింది.






    రిషబ్ పంత్ కొట్టిన ఈ సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్ షాట్‌ చూసి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఎవరైనా ఇలా ఆడగలరా?" అని ఒకరు కామెంట్ చేయగా.. "చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది" అని మరొకరు ట్వీట్ చేశారు. 'పంత్.. తన సొంత ప్రపంచంలో జీవిస్తున్నాడు', "నేను ఇంకా నమ్మలేకపోతున్నా" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: