IND vs BAN | నేడే పింక్ బాల్ టెస్ట్... ఇవీ ప్రత్యేకతలు

India vs Bangladesh Test | పింక్ బాల్ టెస్ట్ ఫస్ట్ సెషన్ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3.40 నుంచి 5.40 వరకు సాగుతుంది. మూడో సెషన్ సాయంత్రం 6 గంటల నుంచీ రాత్రి 8 గంటల వరకూ ఉంటుంది.

news18-telugu
Updated: November 22, 2019, 5:52 AM IST
IND vs BAN | నేడే పింక్ బాల్ టెస్ట్... ఇవీ ప్రత్యేకతలు
IND vs BAN | నేడే పింక్ బాల్ టెస్ట్...
  • Share this:
India vs Bangladesh Pink Ball Test | ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, బంగ్లాదేశ్ పింక్ బాల్ టెస్ట్ మరికొన్ని గంటల్లో జరగబోతోంది. ఇందుకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ పూర్తిగా గులాబీ రంగులో దర్శనమిస్తోంది. స్టేడియంతోపాటూ... కోల్‌కతా మొత్తాన్ని అభిమానులు పింక్ కలర్‌లో డెకరేట్ చేశారు. ఇప్పటివరకూ ఇండియన్ క్రికెట్‌లో తెలుపు, ఎరుపు బంతులు మాత్రమే ఉండేవి. తొలిసారి పింక్ బంతిని వాడుతుండటంతో... ఇదో పండగలా జరుపుకుంటున్నారు. టీమిండియా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో టెస్ట్ ఆడటం మరో విశేషం. రెండు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఓ టెస్టును దక్కించుకున్న టీమిండియా... ఇవాళ మొదలయ్యే రెండో టెస్టులోనూ విజయం సాధించి... సిరీస్ సొంతం చేసుకునేందుకు పట్టుదలతో ఉంది. పైగా ఈ సిరీస్ గెలిస్తే... టీమిండియాకు ఇది వరుసగా 12వ సిరీస్ గెలుపు అవుతుంది. అందువల్ల ఇవాళ్టి చరిత్రాత్మక టెస్ట్ మ్యూచ్‌ను చూసేందుకు... అభిమానులతోపాటూ... రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.


ఈ మ్యాచ్ కోసం టికెట్లు ఆల్రెడీ ఎప్పుడో అమ్ముడైపోయాయి. ఐతే... పింక్ బాల్‌తో ఆడటం అంత ఈజీ కాదు. పైగా ఫ్లడ్‌లైట్ల కాంతిలో ఆడటం, రాత్రి వేళ బౌలింగ్ చాలా కష్టమైనది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండబోతోంది. ఐతే, రాత్రి వేళ కురిసే మంచు సవాల్ విసరనుంది. టీమిండియా ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నా... పూర్తిగా చేతులెత్తేయకూడదని బంగ్లాదేశ్ జట్టు భావిస్తోంది. మన లక్కేంటంటే... ప్రస్తుతం టీమిండియా... బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఈ కారణంగానే తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించేసింది. రెండో టెస్టులోనూ అదే ఊపు కొనసాగించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ నుంచీ ఈసారి ట్రిపుల్ సెంచరీని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. పుజార, రహానె, రోహిత్‌, కోహ్లీ నిలకడగా ఆడితే... గెలుపు భారత్ వశమవుతుంది.


జట్లు (అంచనా)
టీమిండియా : విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, మయాంక్‌, పుజార, జడేజా, రహానె, సాహా, ఇషాంత్‌, ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌, షమి.
బంగ్లాదేశ్‌ : మోమినుల్‌ హక్‌ (కెప్టెన్‌), షద్మాన్‌ ఇస్లాం, కయేస్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, మిథున్‌, లిటన్‌ దాస్‌, మహ్ముదుల్లా, మెహిదీ హసన్‌, ముస్తాఫిజుర్‌, అల్‌ అమిన్‌, అబు జాయేద్‌.

 

సాహో భామ జాక్వెలిన్ అందాలు అదుర్స్



ఇవి కూడా చదవండి :

Health : నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా... డేంజరే.


Health Tips : పియర్స్ తినండి... బరువు తగ్గండి... ఎన్నో ప్రయోజనాలు


Health Tips : డయాబెటిస్‌కి వేపతో చెక్... ఇలా చెయ్యండి

Health Tips : కొబ్బరి పాలతో హెయిర్ స్పా... ఇలా చెయ్యండి
Published by: Krishna Kumar N
First published: November 22, 2019, 5:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading