IND vs BAN | నేడు ఇండియా బంగ్లాదేశ్ తొలి టీ20... పొగే సమస్య

India vs Bangladesh T20 : ఎక్కడైనా మ్యాచ్ జరిగితే... వర్షం పడుతుందా లేదా అన్నది చూస్తారు. ఇవాళ జరిగే ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ విషయంలో మాత్రం పొగ, వాయు కాలుష్యం ఏ రేంజ్‌లో ఉందో చూస్తున్నారు. మ్యాచ్ జరుగుతుందో లేదో డౌటే.

news18-telugu
Updated: November 3, 2019, 6:59 AM IST
IND vs BAN | నేడు ఇండియా బంగ్లాదేశ్ తొలి టీ20... పొగే సమస్య
నేడు ఇండియా బంగ్లాదేశ్ తొలి టీ20... పొగే సమస్య
  • Share this:
India vs Bangladesh T20 : టెస్ట్, టీ20ల్లో సౌతాఫ్రికాను చెడుగుడు ఆడుకున్న టీమిండియా... ఇవాళ బంగ్లాదేశ్‌తో బంతాట ఆడేందుకు సిద్ధమైంది. షాకింగ్ విషయమేంటంటే... టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్... ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరగబోతోంది. ఫ్యాన్స్‌కి ఇంతకంటే నిరాశ ఏం కావాలి. అసలే ఢిల్లీలో పొగ, దుమ్ము, వాయు కాలుష్యం అత్యంత బాగా పెరిగిపోయింది. ఎదురుగా 100 అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించట్లేదు. విజిబులిటీ బాగా తగ్గింది. సమయంలో స్టేడియంలో మ్యాచ్ జరిపేందుకు కూడా పొల్యూషనే సమస్యగా మారింది. పొగే కదా అని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఈ పొగ వల్ల కీలకమైన సందర్భాల్లో వికెట్లు పడవచ్చు, క్యాచ్‌లు మిస్సవ్వవచ్చు... ఏమైనా జరగొచ్చు.


ఇక ఈ సిరీస్‌ ప్రత్యేకతలేంటంటే... దీన్లో విరాట్ కోహ్లీ ఆడట్లేదు. సెలెక్టర్లు అతనికి విశ్రాంతి ఇచ్చారు. అతని బదులుగా రోహిత్ శర్మ కెప్టెన్సీ చేస్తున్నాడు. మొత్తం మూడు టీ20లకు అతడే సారధి. ఆల్రెడీ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. ఇరగదీయడం ఖాయం. కెప్టెన్సీ విషయంలోనూ ఇదివరకూ చాలా సక్సెస్ రేటు సాధించాడు కాబట్టి... టీమిండియా ఫుల్ హ్యాపీగా ఉంది. ఇదే సమయంలో రోహిత్ ముందు ఓ రికార్డు రెడీ ఉంది. ఏంటంటే... ఇంటర్నేషనల్ టీ20ల్లో ఎక్కువ రన్స్ చేసిన ఆటగాడిగా టాప్ పొజిషన్‌లో నిలవాలంటే... రోహిత్ చెయ్యాల్సినవి ఇంకా 8 రన్సే. ప్రస్తుతం ఆ పొజిషన్‌లో కోహ్లీ (2450 రన్స్) ఉన్నాడు. రోహిత్ 2443 రన్స్ చేశాడు. కాబట్టి ఈ రికార్డ్ వద్దన్నా రోహిత్‌ను వరించి తీరడం ఖాయం.


వాయు కాలుష్యం వల్ల మ్యాచ్ వేరే చోట జరపాలని అనుకున్నారు గానీ... చివరి క్షణాల్లో వద్దులే ఇక్కడే నిర్వహిద్దాం అని అనుకున్నారు. ఇప్పుడేమో ఎలా జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. రెండేళ్ల కిందట ఇదే స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 202 రన్స్ చేసింది. ఈ ఫార్మాట్‌లో యావరేజ్ స్కోరు 155. ఆడిన 5 టీ20ల్లో మూడుసార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. కాకపోతే బౌలర్లకు ఇబ్బంది తప్పదు. అయినప్పటికీ మ్యా బాగా జరగాలనీ, మనోళ్లు ఇరగదియ్యాలని కోరుకుందాం.

టీమ్ ఇండియా : రోహిత్‌ (కెప్టెన్‌), ఖలీల్‌ అహ్మద్‌, చాహల్‌, దీపక్‌ చాహర్‌, ధవన్‌, రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే, క్రునాల్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌.

బంగ్లాదేశ్‌ : మహ్ముదుల్లా (కెప్టెన్‌), తైజుల్‌ ఇస్లాం, లిటన్‌ దాస్‌, నయీమ్‌/మిథున్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, సౌమ్య సర్కార్‌, అఫీఫ్‌ హుస్సేన్‌, అరాఫత్‌ సన్నీ, మొసద్దెక్‌ హుస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, అల్‌ అమిన్‌ హొస్సేన్‌.

 

Pics : తెలుగు అందం శృతి రెడ్డి క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :

కేసీఆర్ లెక్క తప్పింది... అంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో...

నేడే లాంగ్ మార్చ్... సిద్ధమైన జన సైనికులు... ఇసుక తుఫానేనా?

Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు


Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...

Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు

First published: November 3, 2019, 6:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading