U19CWCFinal: విశ్వవిజేత బంగ్లాదేశ్...అదరగొట్టిన బంగ్లా యువకులు...మనకుర్రాళ్లు ప్చ్...

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో, తొలిసారి వన్డే క్రికెట్ లో ప్రపంచ కప్ గెలుచుకుంది. బంగ్లాదేశ్ అండర్ 19 వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఐసీసీ నిర్వహించే అత్యున్నత టోర్నీల్లో ఒక దాన్ని ఒడిసి పట్టుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

news18-telugu
Updated: February 9, 2020, 10:04 PM IST
U19CWCFinal: విశ్వవిజేత బంగ్లాదేశ్...అదరగొట్టిన బంగ్లా యువకులు...మనకుర్రాళ్లు ప్చ్...
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ విజయం
  • Share this:
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో, తొలిసారి వన్డే క్రికెట్ లో ప్రపంచ కప్ గెలుచుకుంది. బంగ్లాదేశ్ అండర్ 19 వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఐసీసీ నిర్వహించే అత్యున్నత టోర్నీల్లో ఒక దాన్ని ఒడిసి పట్టుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. సౌతాఫ్రికా గడ్డపై జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా అండర్ 19 జట్టు విధించిన 178 పరుగుల టార్గెట్ ను ఛేదించడంలో బంగ్లా జట్టు తడబడినప్పటికీ, చివర్లో బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్(43) రాణించడంతో బంగ్లాదేశ్ విజయం అందుకుంది. అయితే వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ను46 ఓవర్లలో 170 పరుగులకు కుదించడంతో భారత్ పై బంగ్లాదేశ్ యువ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 47.2 ఓవర్లలో 177 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్ మెన్ లలో యశస్వి జైస్వాల్(88), తిలక్ వర్మ (38), ధ్రువ్ జురెల్(22) మినహా మిగితా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు. బంగ్లాదేశ్ బౌలర్లు వెంట వెంటనే వికెట్లు పడగొడుతూ టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశారు. దీంతో టీమిండియా జట్టు కేవలం 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో బంగ్లాదేశ్ ప్రపంచ కప్ గెలుచుకునేందుకు 178 పరుగుల లక్ష్యచేదన చేయాల్సి ఉంది. బంగ్లా బౌలర్లలో అవిశేక్ దాస్ 3 వికెట్లు పడగొట్టగా, షోరిఫుల్ ఇస్లాం 2, తంజిమ్ హసన్ సకిబ్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.
First published: February 9, 2020, 9:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading