• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS BANGLADESH LIVE SCORE ICC CRICKET WORLD CUP 2019 MATCH AT BIRMINGHAM ROHIT SHARMA COMPLETES 50 RUNS MK

India Vs Bangladesh | మరోసారి రోహిత్ హిట్...బంగ్లా బౌలర్లకు చుక్కలే...

India Vs Bangladesh | మరోసారి రోహిత్ హిట్...బంగ్లా బౌలర్లకు చుక్కలే...

twitter

India Vs Bangladesh Live Score, ICC Cricket World Cup 2019 Match at Birmingham: ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నిలకడగా పరుగులు సాధిస్తున్నారు. రోహిత్ శర్మ ఇప్పటికే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకు పడుతూ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

  • Share this:
    India Vs Bangladesh Live Score, ICC Cricket World Cup 2019 Match at Birmingham: బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచులో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిలకడగా రాణిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నిలకడగా పరుగులు సాధిస్తున్నారు. రోహిత్ శర్మ ఇప్పటికే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకు పడుతూ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ సైతం బ్యాట్ ఝళిపిస్తున్నాడు. దీంతో భారత్ స్కోరు 17 ఓవర్లకే 100 పరుగులు దాటింది. మరోవైపు బంగ్లా బౌలర్లలో ఆందోళన పెరుగుతోంది. ఓపెనింగ్ జోడి ఇప్పటికే 15 ఓవర్లు పూర్తి చేసుకొని సిక్సర్లు, బౌండరీలతో బ్యాట్స్ మెన్ నిలకడగా రన్స్ సాధించడం విశేషం.

    ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో గెలుపు బంగ్లాదేశ్ కు కీలకంగా మారనుంది. సెమీస్ చేరాలంటే బంగ్లా దేశ్ ఈ మ్యాచ్ లో గెలవడం తప్పనిసరి. సెమీస్ రేసులో ఇప్పటికే ఆస్ట్రేలియా స్థానం ఖాయమవగా, భారత్, న్యూజిలాండ్ స్థానాలు సైతం దాదాపు ఖాయమయ్యాయి. అయితే ఇంగ్లాండ్ 10 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్ తర్వాత మ్యాచ్ ఓడినట్లయితే మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు సెమీస్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. దీనికోసం బంగ్లాదేశ్ ప్రస్తుతం భారత్ తో పాటు శుక్రవారం పాకిస్థాన్ తో ఆడే మ్యాచ్ కూడా గెలవాలి. అప్పుడే బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి వచ్చి సెమీఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునే అవకాశం ఉంది.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు