India vs Bangladesh: రోహిత్ శర్మ ఔట్...నిలకడగా ఆడుతున్న భారత్

9 ఓవర్లు ముగిసే నాటికి భారత్ స్కోరు 61/2 గా నమోదైంది. ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియం పేరు అరుణ్‌ జైట్లీ స్టేడియంగా మార్చిన తర్వాత తొలిసారిగా మ్యాచ్‌ జరగుతోంది.

news18-telugu
Updated: November 3, 2019, 7:53 PM IST
India vs Bangladesh: రోహిత్ శర్మ ఔట్...నిలకడగా ఆడుతున్న భారత్
Twitter
  • Share this:
అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీలో భారత్-బంగ్లాదేశ్‌ తొలి టీ-20 మ్యాచ్‌ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టు టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ కేవలం 9 పరుగులకే ఔట్ కాగా, ఎన్నో అంచనాలతో బ్యాటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్ 15 పరుగులకే ఔట్ అవ్వడంతో భారత్‌ బ్యాటింగ్ జోరుకు బ్రేకులు పడ్డాయి. 9 ఓవర్లు ముగిసే నాటికి భారత్ స్కోరు 61/2 గా నమోదైంది. ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియం పేరు అరుణ్‌ జైట్లీ స్టేడియంగా మార్చిన తర్వాత తొలిసారిగా మ్యాచ్‌ జరగుతోంది. ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌.. మ్యాచ్ నెంబర్ 1000వ టీ-20 మ్యాచ్ కావడం విశేషం. అయితే చారిత్రక మ్యాచ్ లో ఎవరు గెలుస్తారోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే బంగ్లాపై ఆడిన ఎనిమిది టీ-20ల్లో గెలుపొందిన భారత జట్టు.. ఈ మ్యాచ్ లోనూ విజయం సాధిస్తుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. రానున్న టీ-20 వరల్డ్‌ కప్ ను దృష్టిలో పెట్టుకున్న సెలక్టర్లు యువ క్రికెట్లర్లకు అవకాశం ఇచ్చింది.

 

First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు