IND Vs BAN 1st test : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా

India Vs Bangladesh 1st Test : ఇటీవలి టీ20 సిరీస్‌లో బంగ్లాపై 2-1తో సిరీస్ నెగ్గిన భారత్.. టెస్టుల్లోనూ అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. తాజా టెస్టులో భారత్ ముగ్గురు పేసర్లతో బరిలో దిగడం గమనార్హం.

news18-telugu
Updated: November 14, 2019, 9:44 AM IST
IND Vs BAN 1st test : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా
టీమిండియా (File Photo)
  • Share this:
ఇండోర్ వేదికగా గురువారం భారత్-బంగ్లా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మొమినుల్ హక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు భారత్‌పై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా నెగ్గని బంగ్లాదేశ్.. ఈసారైనా ఆ కలను నిజం చేసుకోవాలనుకుంటోంది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య ఆరు టెస్టులు మ్యాచ్‌లు జరగ్గా.. ఐదింటిలో భారత్ నెగ్గింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇటీవలి టీ20 సిరీస్‌లో బంగ్లాపై 2-1తో సిరీస్ నెగ్గిన భారత్.. టెస్టుల్లోనూ అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. తాజా టెస్టులో భారత్ ముగ్గురు పేసర్లతో బరిలో దిగడం గమనార్హం.

టీమిండియా : మయాంక్ అగర్వాల్,రోహిత్ శర్మ,పుజారా,కోహ్లి(కెప్టెన్),అజింక్యా రహానె,రవీంద్ర జడేజా,వృద్దిమాన్ సాహా(కీపర్),

అశ్విన్,ఉమేశ్ యాదవ్,మహమ్మద్ షమి,ఇషాంత్ శర్మ

బంగ్లాదేశ్ : ఇమ్రుల్ కైస్,షాద్మన్ ఇస్లాం,మహమ్మద్ మిథున్,మొనిముల్ హక్(కెప్టెన్),ముష్ఫికర్ రహీమ్,
మహ్మదుల్లా లిటన్ దాస్(కీపర్),మెహెది హసన్,తైజుల్ ఇస్లామ్,అబు జయెద్,ఇబాదత్ హసన్.


Published by: Srinivas Mittapalli
First published: November 14, 2019, 9:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading