• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • INDIA VS BANGLADESH 3RD T20I MATCH AT NAGPUR INDIA POCKET SERIES CHAHAR TAKES HAT TRICK MK

India vs Bangladesh: బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘనవిజయం...టీ20 సిరీస్ కైవసం...

విజయానందంలో టీమిండియా ఆటగాళ్లు (Image: Twitter)

భారత్ నిర్దేశించిన 175 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకోవడంలో బంగ్లాదేశ్ తడబడింది. 19.2 ఓవర్లలో 144 పరుగులు చేసి బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ బంగ్లాపై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది.

  • Share this:
    బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ మూడో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 175 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకోవడంలో బంగ్లాదేశ్ తడబడింది. 19.2 ఓవర్లలో 144 పరుగులు చేసి బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ బంగ్లాపై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. లక్ష్యఛేదనలో బంగ్లా 12 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జట్టు భారాన్ని తమపై వేసుకున్న మొహమ్మద్ నైమ్, మొహమ్మద్ మిథున్‌లు జోరు పెంచారు. జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టంచారు. ఆ తర్వాత 110 పరుగుల వద్ద వీరిద్దరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. దీంతో వరుసగా వికెట్లు పతనం అవడంతో బంగ్లా చిక్కుల్లోపడింది. మహ్మద్ నయీమ్ ఒక్కడే 81 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో దీపక్ చహార్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టడంతో పాటు హ్యాట్రిక్ వికెట్లు సైతం తీయడం విశేషం అలాగే శివం దుబే 3 వికెట్లు పడగొట్టాడు.

    ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఒక దశలో మ్యాచ్ ప్రారంభంలోనే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లను స్వల్ప పరుగులకే ఔటయ్యారు. దీంతో బారత్ 100 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులో నిలదొక్కుకున్న లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు అర్ధ సెంచరీలు సాధించి మ్యాచ్ నిలబెట్టారు. శ్రేయాస్ అయ్యర్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. లోకేశ్ రాహుల్ 52 పరుగులు చేశాడు. చివర్లో మనీశ్ పాండే 13 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షఫియుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా అల్ అమిన్ హొసైన్ ఓ వికెట్ తీసుకున్నాడు.
    Published by:Krishna Adithya
    First published: