news18-telugu
Updated: November 22, 2019, 10:44 PM IST
విరాట్ కోహ్లీ (Image: BCCI)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. టెస్టు ఫార్మాట్లో కెప్టెన్‌గా ఐదు వేల పరుగుల్ని కేవలం 86 ఇన్నింగ్సుల్లో వేగవంతంగా పూర్తి చేసిన రికార్డు కోహ్లి పేరిట నమోదు కావడం విశేషం. కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే కోహ్లికి ఇది 84వ టెస్టు కావడం విశేషం, ఇప్పటి వరకూ టెస్టుల్లో ఆయన మొత్తం 7 వేలకు పైగా పరుగులు పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే గతంలో ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. ఒక కెప్టెన్‌గా ఐదు వేల టెస్టు పరుగులు చేయడానికి పాంటింగ్ 97 ఇన్నింగ్స్‌లు పట్టింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(59), అజింక్యా రహానే (23) నాటౌట్ గా నిలిచారు. అంతకుముందు బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు ఆలౌటైంది.
Published by:
Krishna Adithya
First published:
November 22, 2019, 9:21 PM IST