India vs Australia: కోహ్లీ..సరిలేరు నీకెవ్వరు.. బ్యాటింగైనా, ఫీల్డింగైనా నీకు నువ్వే సాటి.. వీడియో వైరల్

విరాట్ కోహ్లీ ( ఫైల్ ఫోటో)

India vs Australia: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జోరు కొనసాగుతుంది. ఫస్ట్ డే బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై ఓపికగా తనదైన బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించి జట్టును గట్టెక్కించిన విరాట్.. రెండో రోజు సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లంతా చెత్త ఫీల్డింగ్‌తో అవకాశాలను చేజార్చుతున్న వేళ.. కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు.

  • Share this:
    ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జోరు కొనసాగుతుంది. ఫస్ట్ డే బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై ఓపికగా తనదైన బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించి జట్టును గట్టెక్కించిన విరాట్.. రెండో రోజు సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లంతా చెత్త ఫీల్డింగ్‌తో అవకాశాలను చేజార్చుతున్న వేళ.. కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఫార్మార్డ్ ఫీల్డర్‌గా ఉన్న విరాట్ అచ్చం చిరుత పులిలా బంతిని వేటాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక విరాట్ కోహ్లీ సూపర్ క్యాచ్‌తో అరంగేట్ర ప్లేయర్ కామెరూన్ గ్రీన్(11) నిరాశగా పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 40 ఓవర్ మూడో బంతిని గ్రీన్ మిడ్ వికెట్ మీదుగా ఆడగా.. ఫార్వార్డ్‌గా ఉన్న విరాట్ సూపర్ డైవ్‌తో బంతిని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు.

    విరాట్ సూపర్ క్యాచ్‌కు మైదానంలో ఆటగాళ్లతో పాటు టీవీ ముందు ప్రేక్షకులు బిత్తరపోయారు. ఎన్నో ఆశలతో ఫస్ట్ మ్యాచ్‌ బరిలోకి దిగిన గ్రీన్ అయితే తెల్ల మొహం వేసుకొని పెవిలియన్ బాట పట్టాడు. ఈ సూపర్ క్యాచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టార్ ప్లేయర్లు సూపర్ స్టార్లే అంటూ కొనియాడుతున్నారు. బంతిని విరాట్ చిరుతలా వేటాడాడని ప్రశంసిస్తున్నారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. కింగ్ కోహ్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సూపర్ క్యాచ్‌తో ఆసీస్ 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


    ఇక అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. బ్యాట్స్ మెన్ విఫలమైన చోట రాణించి టీమిండియాకు ఆధిక్యం సంపాందించారు. తొలి డే/నైట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్‌ (4/55), ఉమేశ్ యాదవ్ (3/40), బుమ్రా (2/52) ఆసీస్‌ జట్టును బెంబేలెత్తించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో‌ కెప్టెన్‌ టిమ్ పైన్ (73*) ఒంటరి పోరాటం చేశాడు. మరో బ్యాట్స్ మెన్ లబుషేన్‌ (47) రాణించాడు. టీమిండియా ఫీల్డింగ్ నాసిరకంగా ఉండటంతో ఆస్ట్రేలియా ఈ మాత్రం స్కోరైనా చేసింది. లేకపోతే ఆస్ట్రేలియా టీమ్ ఎప్పుడో ఆలౌట్ అవ్వాల్సి ఉంది.

    Ind vs Aus , India vs Australia 2020, adelaide test, first test, adelaide test news, Pink ball, pink test, labuschange, prithvi shaw, catches, drop, umesh yadav, ashwin, భారత్-ఆస్ట్రేలియా, మార్నస్ లబుషేన్, క్యాచ్ , ఫీల్డింగ్ తప్పిదాలు, అడిలైడ్ టెస్ట్
    India vs Australia


    మరోవైపు మళ్లీ బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో డకౌటైన పృథ్వీషా మరో సారి నిరాశపర్చాడు. కేవలం నాలుగు పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఇక వన్ డౌన్ లో నైట్ వాచ్ మెన్ బుమ్రా బ్యాటింగ్ కు దిగాడు. మయాంక్, బుమ్రా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి భారత్ 9 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 62 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
    Published by:Sridhar Reddy
    First published: