India vs Australia: చివరిలో వన్డేలో టీమిండియా విజయం.. మ్యాచ్‌ని టర్న్ చేసిన బుమ్రా

క్యాన్‌బెరా వేదికగా ఆస్ట్రేలియా,ఇండియా మధ్య జ‌రిగిన నామాత్రపు వన్డేలో భారత్ విజయం సాధించింది. మూడు వన్డేలా సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్లిప్ చేయకుండా అడ్డుకుంది.

news18-telugu
Updated: December 2, 2020, 5:44 PM IST
India vs Australia: చివరిలో వన్డేలో టీమిండియా విజయం.. మ్యాచ్‌ని టర్న్ చేసిన బుమ్రా
Team india
  • Share this:
క్యాన్‌బెరా వేదికగా ఆస్ట్రేలియా,ఇండియా మధ్య జ‌రిగిన నామాత్రపు వన్డేలో భారత్ విజయం సాధించింది. మూడు వన్డేలా సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్లిప్ చేయకుండా  కోహ్లి సేన  అడ్డుకుంది. చివరి వన్డేలో ఆసీస్‌పై గెలిచి పరువు నిలుపుకుంది. 13 పరుగుల తేడాతో  ఆస్ట్రేలియాపై టీమిండియా  విజయం సాదించింది. భారత్ నిర్ధేశించిన 303 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో ఆసీస్ విఫలమైంది. నిర్ణీత 49.3 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఫించ్ (75), మాక్స్‌వెల్‌ (59) దాటిగా ఆడినప్పటికి మిగితా బాట్స్‌మెన్స్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆసీస్ తడబడింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టుగా బౌలింగ్ చేయడంతో ఆసీస్  బాట్స్‌మెన్స్ పరుగులు రాబట్టలేకపోయారు.

ఆసీస్ బ్యాటింగ్ సాగిన తీరు

303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పొయింది. ఈ మ్యాచ్‌లోనే వ‌న్డే అరంగేట్రం చేసిన న‌ట‌రాజ‌న్ తొలి వికెట్ తీశాడు. వార్నర్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన లబుషేన్ (7)ను బౌల్డ్‌ చేశాడు. లబుషేన్‌ షాట్‌కు యత్నించగా ఇన్‌సైడ్ ఎడ్జ్‌ తీసుకుని బంతి వికెట్లను తాకింది. ఆ ఓవర్‌ను మేడిన్ చేశాడు. 5 ఓవర్ల వరకు ఆసీస్ 25/1 స్కోర్ సాధించింది. ఆ తర్వాత ఫించ్‌,స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. శార్దూల్ ఠాకూర్ దాటికి వరసగా రెండు వికెట్లు కోల్పొయింది. స్టీవ్ స్మిత్ (7), హెన్రిక్స్ (22) వికెట్లను ఆసీస్ వెంట వెంటనే కోల్పొయింది. అత్యంత కీలకమైన కెప్టెన్ ఫించ్ (75) వికెట్‌ను జడ్డూ తీయడంతో మ్యాచ్‌పై భార‌త్ పట్టు బిగించింది. ఆ తర్వాత కామెరాన్‌ గ్రీన్ ‌(21; 27 బంతుల్లో 1×4, 1×6) కుల్‌దీప్‌ బౌలింగ్‌లో జడ్డూ క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. అలెక్స్‌ కేరీతో కలిసి చేలరేగిపోయాడు. సిక్స్,పోర్లతో విరుచుకపడ్డాడు. చివరకు బుమ్రా మాక్స్‌వెల్‌ ( 59 ; 38 బంతుల్లో 4×4, 4×6)ను బౌల్డ్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది.

ఆసీస్‌ను ఉతికారేసిన జడేజా,హార్దిక్‌

ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభంలో తడబడింది. . 6 ఓవర్లో భారత్ తొలి వికెట్ కోల్పొయింది. ధావన్‌ (16) అగర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. ఈ క్రమంలో వన్డేల్లో 12వేల పరుగులు సాధించిన ఆటగాళ్ళ జాబితాలో కోహ్లీ చేశాడు . విరాట్ కోహ్లి(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత వరుసగా భారత్ వికెట్లు కోల్పొయింది. గిల్(33),శ్రేయస్ అయ్యార్(19),కేల్ రాహుల్(5),కోహ్లి(63)
ఔటవడంతో టీమిండియా కష్టాల్లో పడింది.

ఆ తర్వాత జడేజా,హర్ధిక్ పాండ్యా ఆటను మరో రెంజ్‌లోకి తీసుకెళ్ళారు. 40 ఓవర్ల తర్వాత వీరు దూకుడు పెంచారు. అప్పటికి భారత్‌ స్కోర్ 192/5 పరుగుల వద్ద నిలిచింది. దాటిగా ఆడిన హార్దిక్ (51) అర్ధశతకం అందుకున్నాడు. అప్పటి నుంచి భారత్ ఆట మరో రెంజ్‌లోకి వెళ్ళిపోయింది. హేజిల్‌వుడ్‌,అబాట్‌‌లకు చుక్కలు చూపించారు. చివరి ఓవర్లలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరు కలిసి 108 బంతుల్లో 159 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. జడేజా 66 పరుగులు చేయగా,హార్ధిక్ పాండ్యా 92 పరుగులు సాధించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది.
Published by: Rekulapally Saichand
First published: December 2, 2020, 5:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading