• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS AUSTRALIA TOUR GETS GREEN LIGHT FROM NSW GOVERNMENT SYDNEY CANBERRA TO HOST LIMITED OVERS LEG SA

India vs Australia: ఆసీస్ టూర్ తేదీలు ఖరారు.. మొదటి వన్డే ఎప్పుడంటే!

India vs Australia: ఆసీస్ టూర్ తేదీలు ఖరారు.. మొదటి వన్డే ఎప్పుడంటే!

(Image: Twitter)

ఆస్ట్రేలియా పర్యటన కోసం  ఆసీస్ క్రికెట్ బోర్డు నుంచి  గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. క్రికెట్ వెబ్‌సైట్ ESPN Cricinfo కథనం ప్రకారం ఆసీస్ పర్యటకు వెళ్ళే  జట్టుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

  • Share this:
    త్వరలో ప్రారంభం కానున్న భారత్  ఆస్ట్రేలియా పర్యటనకు  ఆసీస్ క్రికెట్ బోర్డు నుంచి  గ్రీన్ సిగ్నల్ లభించింది. క్రికెట్ వెబ్‌సైట్ ESPN Cricinfo కథనం ప్రకారం ఆసీస్ పర్యటకు వెళ్ళే  జట్టుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్‌లు సిడ్నీ , కాన్‌బెర్రాలో జరుగునున్నాయని ఆ సంస్థ తన కథనంలో పేర్కొంది. ఆ వెబ్ సైట్ తెలిపిన వివారాల ప్రకారం "వచ్చే నెలలో టీంమిండియా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టనుంది. క్రికెట్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం సంయిక్తంగా భారత జట్టుకు సంబంధించిన అతిథ్య ఏర్పాట్లను సమీక్షిస్తోంది. క్వారెంటైన్, శిక్షణా సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నాయి.  ఈ పర్యటనలో భాగంగా మెుదటి వన్డే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(SCG) అతిథ్యం ఇవ్వనుంది.. నవంబర్ 27న ఈ మ్యాచ్ జరగనుంది.

    ఆస్ట్రేలియా పర్యటన తేదీలు

    మెుదటి వన్డే: నవంబర్ 27 - ఎస్సీజీ

    రెండో వన్డే: నవంబర్ 29 - ఎస్సీజీ

    మూడో వన్డే: డిసెంబర్ 1 - మనుకా ఓవల్

    మెుదటి టి 20 ఐ: డిసెంబర్ 4 - మనుకా ఓవల్

    రెండో టీ 20 ఐ: డిసెంబర్ 6 - ఎస్సీజీ

    మెుదటి టీ 20 ఐ: డిసెంబర్ 8 - ఎస్సీజీ

    మెుదటి టెస్ట్: డిసెంబర్ 17-21 - అడిలైడ్ ఓవల్

    రెండో టెస్ట్: డిసెంబర్ 26-31 - ఎంసిజి

    మూడో టెస్ట్: జనవరి 7- 11 - ఎస్సీజీ

    నాలుగో టెస్ట్: జనవరి 15-19 - బ్రిస్బేన్

    టెస్ట్ సిరీస్‌ పింక్ బాల్‌లో ఆడనున్నారు. డిసెంబర్ 17-21 మధ్య అడిలైడ్ ఓవల్‌లో వేదికగా మెుదటి టెస్ట్ జరాగాల్సి ఉంది. కోవిడ్ -19 పరిమితులు దృష్ట్యా వేదికను మార్చే అవకాశం కనిపిస్తోంది. రెండో టెస్టు సిడ్నీ (జనవరి 7-11)లో జరగనుండగా,చివరి టెస్ట్ బ్రిస్బేన్ (జనవరి 15-19) వేదికగా జరుగనుంది.
    Published by:Rekulapally Saichand
    First published: