Home /News /sports /

INDIA VS AUSTRALIA TEAM INDIA NAME PLAYING XI FOR ADELAIDE TEST PRITHVI SHAW WRIDDHIMAN SAHA INCLUDED SRD

India vs Australia 1st Test: కేఎల్ రాహుల్, గిల్ కు దక్కని చోటు..పృథ్వీ షా, వృద్ధిమాన్ సాహాలకే ఓటు.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

Team india (ఫైల్ ఫోటో)

Team india (ఫైల్ ఫోటో)

India vs Australia 1st Test: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టు ఆడనున్న ప్లేయింగ్ ఎలెవన్‌ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన జట్టు లో కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ లకు చోటు దక్కలేదు. ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకున్న ప్లేయర్స్ ఎవరంటే..

ఇంకా చదవండి ...
    బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టు ఆడనున్న ప్లేయింగ్ ఎలెవన్‌ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఆడిలైడ్‌లో గురువారం తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా ఆడనుండగా, ముగ్గురు పేసర్లతో భారతజట్టు బరిలోకి దిగనుంది. సూపర్ ఫాంలో ఉన్నప్పటకీ కేఎల్ రాహుల్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. వికెట్ కీపర్‌గా పంత్‌ను కాదని.‌. సీనియర్ సాహాకే అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్‌కు వైస్ కెప్టెన్‌గా రహానే వ్యవహరించనున్నాడు.

    పేస్ బౌలింగ్ లో బుమ్రా, షమీలతో సీనియర్ పేసర్ ఉమేష్ వైపే మొగ్గు చూపాడు విరాట్ కోహ్లీ. స్పినర్‌గా సీనియర్ బౌలర్ అశ్విన్‌కు అవకాశం దక్కింది. గాయంతో ఇబ్బంది పడుతున్న రవీంద్ర జడేజాకు చోటు కల్పించలేదు. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో రాణించిన శుభ్ మన్ గిల్ కు చోటు దక్కకపోవడంతో కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. ఫామ్ లో లేని పృథ్వీ షా కు టీమ్ మేనేజ్ మెంట్ ఓటు వేసింది. ప్లేయింగ్ ఎలెవన్ ను సెలెక్ట్ చేయడానికి కొంచెం తర్జన భర్జన పడినట్లు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. చివరికి బెస్ట్ జట్టునే ఫస్ట్ టెస్ట్ కి ఎంపిక చేసినట్లు కోహ్లీ వివరించాడు.


    టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ : విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారీ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్ర అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Cheteswar Pujara, IND vs AUS, India vs Australia 2020, KL Rahul, Prithvi shaw, Rishabh Pant, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు