India vs Australia : టీమిండియా స్పీడ్ స్టార్ షూ కు హోల్.. ఎందుకో తెలుసా..?

Shami Shoe Hole (image : twitter)

India vs Australia : ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ హోల్ ఉన్న షూతో బరిలోకి దిగడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. షమీ షూకు ఎందుకు హోల్ పెట్టుకున్నాడో తెలుసా..?

  • Share this:
    ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ హోల్ ఉన్న షూతో బరిలోకి దిగడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అతని ఏడమ బూటు ముందు భాగంలో బొటన వేలికి గాలి ఆడేలా పెద్ద హోల్ చేసి ఉంది. ఓవర్‌నైట్ స్కోర్ 236/6 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీసేన.. స్టార్క్, కమిన్స్ ధాటికీ మరో 11 పరుగులు మాత్రమే చేసి 244 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్‌ సాహా (9 ), అశ్విన్‌ (15) పరుగులేమి చేయకుండా వెనుదిరగ్గా.. టేలండర్ ఉమేశ్ యాదవ్(6), మహ్మద్ షమీ(0) కూడా ఆసీస్ బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. దాంతో భారత్ రెండో రోజు ఆట 25 బంతులకే పరిమితమైంది. ఆ వెంటనే ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ ప్రారంభించగా.. మైదానంలోకి దిగిన షమీ చిరిగిన షూస్‌తో కనిపించాడు. అదేంటి అంతర్జాతీయ క్రికెటర్ చిరిగిన షూస్ వేసుకోవడం ఏంటని అంతా షాక్ అయ్యారు. కానీ దాన్ని నిశితంగా పరిశీలించగా.. కావాలనే రంధ్రం చేసుకున్నట్లు కనిపించింది.

    బౌలింగ్ చేసేటప్పుడు బొటన వేలు ఫ్రీగా ఉండేందుకు షమీ ఈ ఆలోచన చేశాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హోల్ వల్ల బొటన వేలిపై ఎక్కువగా ఒత్తిడి పడదని, అతని సౌకర్యార్థం అలా చేసి ఉండవచ్చంటున్నారు. ఇక షమీ ఐడియాకు కొంత అభిమానులు ఫిదా అవుతుండగా.. మరికొందరు మాత్రం ఇది పాతదేనని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం షమీ షూకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్ల హల్‌చల్ చేస్తున్నాయి.



    ఫస్ట్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ధాటికి ఓపెనర్లు మాథ్యూ వేడ్(8), జో బర్న్స్(8) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగాడు. ఈ ఇద్దరిని బుమ్రా వికెట్లు ముందు బోల్తా కొట్టించగా.. రివ్యూ కెళ్లిన ఆసీస్ ఓపెనర్లు భంగపాటుకు గురయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన లబుషేన్‌కు భారత ఫీల్డర్లు రెండు లైఫ్‌లు ఇచ్చారు. బుమ్రా బౌలింగ్‌లో అతను ఇచ్చిన కష్టతరమైన స్లిప్ క్యాచ్‌ను అందుకోవడంలో సాహా, పుజారా విఫలమవ్వగా.. షమీ బౌలింగ్‌లో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బుమ్రా నేలపాలు చేశాడు. బౌండరీ లైన్ వద్ద తప్పుగా అంచనా వేసిన బుమ్రా నేలపాలు చేశాడు. ఇక స్పిన్నర్ అశ్విన్ ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్ తడబడుతున్నారు. అశ్విన్ మూడు వికెట్లు తీయగా ఆస్ట్రేలియా సగం జట్టు పెవిలియన్ బాట పట్టింది. ప్రస్తుతం క్రీజులో లబుషైన్, టిమ్ పైన్ క్రీజులో ఉన్నారు.
    Published by:Sridhar Reddy
    First published: