హోమ్ /వార్తలు /క్రీడలు /

Hyderabad: ఉప్పల్ స్టేడియంలో IND vs AUS టీ20 మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

Hyderabad: ఉప్పల్ స్టేడియంలో IND vs AUS టీ20 మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IND vs AUS T20 Series: గ్రౌండ్‌లో ఏర్పాట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ పర్యవేక్షిస్తున్నారు. పేటీఎం వెబ్ సైట్/యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కరోనా తర్వాత హైదరాబాద్‌(Hyderabad) తొలిసారి క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. ఈ నెల 25న ఆస్ట్రేలియాతో భారత్ (India Vs Australia) తలపడనుంది. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో భాగంగా... మూడో మ్యాచ్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (Uppal Cricket Stadium) జరుగుతుంది. అందుకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గ్రౌండ్‌లో ఏర్పాట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ పర్యవేక్షిస్తున్నారు. పేటీఎం వెబ్ సైట్/యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

  ఆస్ట్రేలియాతో సెప్టెంబరు 20 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్ కోసం భారత సెలెక్టర్లు మంగళవారం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 16 మందితో కూడిన భారత టీమ్‌‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటారు. గాయం నుంచి కోలుకోవడంతో బుమ్రా, హర్షల్‌ పటేల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. చాలా రోజుల తర్వాత టీ20 జట్టులోకి మహ్మద్ షమీ ఎంట్రీ ఇచ్చాడు. దీపక్ చాహర్‌కి కూడా చోటుక్కింది. టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి ఎంపికైన అర్షదీప్ సింగ్‌కి ఆస్ట్రేలియా సిరీస్‌లో మాత్రం రెస్ట్ ఇచ్చారు.

  భారత్ జట్టు:

  రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేందర్ చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్.

  ఆస్ట్రేలియా VS ఇండియా టీ20 సిరీస్ షెడ్యూల్:

  సెప్టెంబర్ 20 - మొహాలీ - తొలి టీ20

  సెప్టెంబర్ 23 - నాగ్‌పూర్ - రెండో టీ20

  సెప్టెంబర్ 25 - హైదరాబాద్ - మూడో టీ20

  ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చివరగా 2019 డిసెంబర్‌లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో భారత్ టీ20 తలపడింది. అప్పటి నుంచి మరో మ్యాచ్ జరగలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా నిర్వహించలేదు. ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లు యూఏఈలో జరిగాయి. 2022 సీజన్ అహ్మదాబాద్, ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఉప్పల్‌లో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీగా తరలివస్తారన్న అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దాంతో విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఐపీఎల్ మ్యాచులు కూడా జరగాలని కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ ముగిశాక.. సెప్టెంబరు 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కూడా జరుగుతుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cricket, Hyderabad

  ఉత్తమ కథలు