HOME »NEWS »SPORTS »india vs australia rohit sharmaout six times in nathan lyon bowling sa

రోహిత్‌ శర్మ మరోసారి.. హిట్‌‌మ్యాన్ ఎక్కువ పార్లు ఔటైంది అతని బౌలింగ్‌లోనే...

రోహిత్‌ శర్మ మరోసారి.. హిట్‌‌మ్యాన్ ఎక్కువ పార్లు ఔటైంది అతని బౌలింగ్‌లోనే...
rohith

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ టెస్ట్ ఫార్మట్‌లో ఒకే బౌలర్‌ చేతిలో ఆరుసార్లు ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్ లైయన్‌ హిట్‌మ్యాన్‌ను ఆరు సార్లు తన బౌలింగ్‌లో పెవిలియన్ పంపాడు.

  • Share this:

    టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ టెస్ట్ ఫార్మట్‌లో ఒకే బౌలర్‌ చేతిలో ఆరుసార్లు ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్ లైయన్‌ హిట్‌మ్యాన్‌ను ఆరు సార్లు తన బౌలింగ్‌లో పెవిలియన్ పంపాడు. తాజా పర్యటనలో ఆస్ట్రేలియాతో రోహిత్ ఆడిన మూడు ఇన్నింగ్స్‌లోనూ లైయనే ఔట్ చేశాడు. గాయం కారణంగా పూర్తి స్థాయి పర్యటనలో కొనసాగలేకపోయిన రోహిత్ మూడో టెస్టు 44 పరుగులు చేసి నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరగాడు. ఇలా లైయన్‌ బౌలింగ్‌లోనే రోహిత్ ఆరు సార్లు చిక్కాడు. దీంతో హిట్‌మ్యాన్‌ను ఎక్కువ సార్లు ఔట్ చేసిన రికార్డు కగిసో పేరు మీద ఉండగా ఇప్పుడా ఆ రికార్డును లైయన్‌ అధిగమించాడు. రబాడతో రోహిత్‌ను ఐదుసార్లు ఔట్ చేశాడు. దీంతో రోహిత్‌ను టెస్టుల్లో అత్యధిక సార్లు ఔట్‌ చేసిన బౌలర్‌గా ఈ ఆస్ట్రేలియా స్పిన్నర్‌ రికార్డు నెలకొల్పాడు. లైయిన్ ఇంకో మూడు వికెట్లు 400 వికెట్ల క్లబ్‌లో చేరుతాడు.



    800 వికెట్లు సాధించే సత్తా నాథన్‌ లైయన్‌కు లేదు

    ఆసీస్ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ 800 వికెట్లు తీసే సత్తా లేదని స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ అన్నారు. తాజాగా టెలిగ్రాఫ్‌ అతడి వ్యాఖ్యలకు సంబంధించిన కథనాన్ని ప్రచురించింది. ‘అశ్విన్‌కు 800 వికెట్లు తీసే సత్తా ఉంది. అతని రికార్డును మరే బౌలర్ అందుకోలేడు. నాథన్‌ లైయన్‌ కూడా అతని స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేడు. ఇప్పటివరకు అతను 396 వికెట్లతో మాత్రమే తీశాడు. 800 వికెట్ల మైలురాయిని చేరుకోవాలంటే చాలా కాలం అడాల్పి ఉంటుందని" మురళీధరన్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అశ్విన్‌ 74 టెస్టుల్లో 377 వికెట్లతో తీశాడు. ఇక 99 టెస్టుల్లో అతనికంటే ఎక్కువగా 397 వికెట్లు సాధించాడు.
    Published by:Rekulapally Saichand
    First published:January 16, 2021, 16:59 IST

    टॉप स्टोरीज