ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా పృథ్వీ షా ఆటను నిశితంగా పర్యవేక్షించిన పాంటింగ్ అతని లోపాన్ని వివరించాడు. షా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని బ్యాట్‌కు ప్యాడ్‌కు చాలా గ్యాప్ ఉంటుందని, ఆసీస్ బౌలర్లు దాన్ని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేస్తే సరిపోతుందన్నాడు. అయితే పాంటింగ్ చెబుతుండగానే పృథ్వీషా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాంటింగ్ చెప్పిన విధంగానే షా లోపంపై టార్గెట్ చేసిన మిచెల్ స్టార్క్ ఫలితాన్ని రాబట్టాడు. దాంతో టీవీల ముందున్న ప్రేక్షకులు, విశ్లేషకులు బిత్తరపోయారు. పాంటింగ్ చెప్పింది కరెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
‘పృథ్వీషా తనవైపు బంతి దూసకొచ్చినప్పుడల్లా అతని బ్యాట్, ప్యాడ్ మధ్య చాలా గ్యాప్ ఇస్తుంటాడు. ఇలా తరుచూ చేస్తుంటాడు. ఆసీస్ ఆ గ్యాప్ టార్గెట్ చేస్తే ఫలితం రాబట్టవచ్చు.'అని చెబుతుండగానే.. స్టార్క్ బంతికి షాట్ బౌల్డ్ అయ్యాడు. బ్యాట్‌కు తగిలిన బంతి పాంటింగ్ చెప్పిన గ్యాప్‌లో నుంచే వెళ్లి వికెట్లకు తాకింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక ఐపీఎల్లో కూడా షా ఇదే తరహాలో పలుమార్లు ఔటై.. తుది జట్టులో చోటు కోల్పోయాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఆరంభంలో అదరగొట్టిన పృథ్వీషా.. సెకండాఫ్‌లో దారుణంగా విఫలమయ్యాడు.
"If he does have a chink in his armour it's the ball which does come back into him...
"Quite often leaves a big gap between bat and pad and that's where the Aussies will target." @RickyPonting at his peerless best for the Prithvi Shaw wicket #AUSvIND pic.twitter.com/4nh67zBcpU
— 7Cricket (@7Cricket) December 17, 2020
ఇక ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ షా దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనికి తుది జట్టులో చోటు దక్కడం డౌటేనని అందరూ భావించారు. శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్‌లో మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకోవడంతో షా బెంచ్‌కే పరిమితమవుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా గిల్‌ను కాదని పృథ్వీ షాకు టీమ్‌మేనేజ్‌మెంట్ చాన్స్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని షా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆదిలోనే అది పరుగు కూడా చేయకుండానే ఔటై తీవ్రంగా నిరాశపరిచాడు.ఇక పృథ్వీ ఔటైన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.