• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • INDIA VS AUSTRALIA PAK SPEEDSTER SHOAIB AKTHAR PRAIES RAHUL DRAVID AND RAVI SHASTRI FOR INDIAS HISTRIOC SERIES WIN GH SRD

India vs Australia : భారత క్రికెట్ జట్టును ఆకాశానికెత్తిన పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టార్

Shoiab Akthar (ఫైల్ ఫోటో)

India vs Australia : ఆసీస్ పర్యటనలో భారత జట్టు సాధించిన విజయాలను క్రికెట్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గబ్బాలో జరిగిన ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమ్ ఇండియా చారిత్రక విజయం సాధించి సిరీస్‌ గెల్చుకుంది. దీంతో మన టెస్టు జట్టు ప్రదర్శనను వివిధ దేశాల మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.

  • Share this:
ఆసీస్ పర్యటనలో భారత జట్టు సాధించిన విజయాలను క్రికెట్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గబ్బాలో జరిగిన ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమ్ ఇండియా చారిత్రక విజయం సాధించి సిరీస్‌ గెల్చుకుంది. దీంతో మన టెస్టు జట్టు ప్రదర్శనను వివిధ దేశాల మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా ఈ జాబితాలో చేరాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత అతడు ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. ఆట గురించి తన ఛానెల్‌లో చర్చిస్తూ సక్సెస్‌ఫుల్ యూట్యూబర్‌గా మారాడు. దీంట్లో వచ్చిన తాజా ఎపిసోడ్‌లో అక్తర్ గబ్బాలో భారత జట్టు ఆటతీరును విశ్లేషించాడు. సిరీస్‌లోని మన క్రికెటర్లు బాగా ఆడారని ప్రశంసించాడు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టు విజయాలకు గల కారణాలను అక్తర్ వివరించాడు.

* 20ఏళ్ల కృషి
భారత జట్టు ఇప్పుడు సాధిస్తున్న విజయాలకు కారణం ఇండియన్ క్రికెట్ సిస్టమ్ అని అక్తర్ చెబుతున్నాడు. గత ఇరవై ఏళ్లుగా క్రికెట్ వనరులను అభివృద్ధి చేసుకుంటూ ప్రస్తుత స్థాయికి టీమ్ ఇండియా చేరుకుందని చెప్పాడు. రిజర్వు బెంచ్‌ను పటిష్టం చేసుకుంటూ భారత్ విజయాలను సాధిస్తోందన్నాడు. ఈ విజయాలకు రవిశాస్త్రి నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు ప్రతి ఒక్కరూ కృషి చేశారని వివరించాడు. ‘IPL వల్ల అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం యువ ఆటగాళ్లకు లభిస్తోంది. దీంతో కుర్రాళ్లకు ఆటపై నమ్మకం పెరుగుతోంది’ అని అక్తర్ తన యూట్యూబ్ వీడియోలో వివరించాడు.

* ద్రవిడ్ వల్లే విజయాలు
భారత జట్టు విజయాల్లో రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందని అక్తర్ చెప్పాడు. యువ ఆటగాళ్లను అతడు మేటి ప్లేయర్లుగా తీర్చిదిద్దుతుండగా, జట్టులో వారిని రవిశాస్త్రి ప్రోత్సహిస్తున్నాడని తెలిపాడు. ఇప్పటి వరకు భారత్‌ చూసిన ఉత్తమ టెస్ట్ ప్లేయర్ ద్రవిడ్ అని ప్రశంసించాడు. ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు అందరూ క్రికెట్ అకాడమీలో ద్రవిడ్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఈ మాజీ ఆటగాడు తయారు చేసిన బలమైన అండర్-19 జట్టు ప్లేయర్లే ఇప్పుడు గబ్బాలో ఆసీస్‌ను మట్టికరిపించారని పేర్కొన్నాడు.

* విజయంలో వారి పాత్ర
‘యువ ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, షార్దుల్ ఠాకూర్, సిరాజ్, గిల్, పంత్, మయాంక్ అగర్వాల్ తమ చుట్టూ ఏంజరుగుతుందో పట్టించుకోకుండా విజయం కోసం పోరాడారు. రిషబ్ పంత్ ఎలాంటి భయం లేకుండా ఆసీస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. మరోవైపు జాతి వివక్ష ఆరోపణలు వినిపించాయి. అయినా రవిశాస్త్రి మాత్రం యంగ్ ప్లేయర్లపై నమ్మకం పెట్టుకున్నాడు. వారు డబ్బు కోసం క్రికెట్‌లోకి రాలేదు. ఆటపై ప్రేమతో వచ్చారు. వారు నిజమైన హార్డ్ వర్కర్లు’ అని అక్తర్ మనవాళ్లను మెచ్చుకున్నాడు. ఈ క్రెడిట్ అంతా మేటి టీమ్‌ను తీర్చిదిద్దిన ద్రవిడ్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ వంటి లీడర్లదని చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, క్రికెటర్లను స్వేచ్ఛగా ఆడనిచ్చే టీమ్ మేనేజ్‌మెంట్ కూడా విజయాల్లో పాత్ర పోషిస్తుందని అక్తర్ వివరించాడు.
Published by:Sridhar Reddy
First published: