కోహ్లి ఇండియాకి వెళుతాడు.. దాన్ని వారు అవకాశంగా మార్చుకోవచ్చు!

ఆస్ట్రేలియా టూర్‌లో మధ్యలోనే కోహ్లి భారత్ తిరిగి వెళ్ళడం కొంత నిరుత్సాహపరిచే ఆంశమే అన్నారు టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. విరాట్‌ కోహ్లిని కచ్చితంగా మిస్సవుతామని తెలిపారు.

news18-telugu
Updated: November 24, 2020, 11:49 AM IST
కోహ్లి ఇండియాకి వెళుతాడు.. దాన్ని వారు అవకాశంగా మార్చుకోవచ్చు!
kohli and rohith
  • Share this:
ఆస్ట్రేలియా టూర్‌లో మధ్యలోనే కోహ్లి భారత్ తిరిగి వెళ్ళడం కొంత నిరుత్సాహపరిచే ఆంశమే అన్నారు టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. విరాట్‌ కోహ్లిని కచ్చితంగా మిస్సవుతామని తెలిపారు. ప్రస్తుతం టీమిండియాలో చాలా మంది యువ ఆటగాళ్ళ ఉన్నరని వారందరికి  ఈ సిరీస్ తమను తాము నిరూపించుకునే అవకాశం ఉందన్నారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఈ పర్యటనలో పూర్తి స్థాయిగా కొనసాగాడన్న విషయం అందరికి తెలిసిందే!. కొహ్లీ మొదటి టెస్ట్ అనంతరం పితృత్వ సెలవుల కోసం ఇండియాకు తిరిగొస్తాడు. జనవరిలో కోహ్లి సతిమణి అనుష్క శర్మ డెలివరీ కానుంది. దీంతో ప్రసవ సమయంలో తన భార్య పక్కన ఉండాలని భావించిన కోహ్లి టూర్‌ చివరిలో స్వదేశానికి తిరిగి రానున్నారు. కోహ్లి నిర్ణయంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా అంగీకారం తెలిపింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కోహ్లికి అనుమతి ఇచ్చింది. బీసీసీఐ కూడా ఈ వార్తను ధృవీకరించింది.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 17న మొదలయ్యే తొలి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి తిరిగి వస్తారు. అతను లేకపోవడం వల్ల ఎంతో ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకోవాలన్న టీమిండియా ఆశయంపై తీవ్ర ప్రభావం చూపనుందని క్రికెట్‌ దిగ్గజాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కోహ్లి పితృత్వ సెలవులను తీసుకోవడంపై మిశ్రమ స్పందనలు వస్తున్న వేళ.. కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. కోహ్లి సరైన నిర్ణయమే తీసుకున్నాడని సమర్థించాడు. తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన రవి శాస్త్రి.. ‘‘ టీమిండియా విజయాలలో కోహ్లి పాత్ర ఏంటో అందరికి తెలిసిందే!. జట్టును ముందుండి నడిపిస్తూ ఏన్నో కీలక విజయాలను అందించాడు. అలాంటి కీలక వ్కక్తిని ఈ సిరీస్‌లో కచ్చితంగా మిస్సవుతాం. జీవితంలో కొన్ని అపురూప క్షణాలు మళ్లీ మళ్లీ రావు. ఆ క్షణాలను అనుభవించడానికి స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి లభించింది. అతడు ఈ విషయంలో సరైన నిర్ణయమే తీసుకున్నాడు. అతని స్థానంలో యువ ఆటగాళ్లు ఆడి తమను తాము నిరూపించుకునే అవకాశం ఇది’’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.
Published by: Rekulapally Saichand
First published: November 24, 2020, 11:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading