IND vs AUS : నేడు భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే... మనోళ్లు కొట్టేస్తారా?

India vs Australia 1st ODI | దేశవ్యాప్తంగా వేర్వేరు పేర్లతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న రోజుల్లో ఉత్సాహంగా ఉన్న టీమిండియా... ఆస్ట్రేలియాకి షాక్ ఇస్తామంటోంది. కచ్చితంగా ఓడిస్తామంటోంది.

news18-telugu
Updated: January 14, 2020, 7:38 AM IST
IND vs AUS : నేడు భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే... మనోళ్లు కొట్టేస్తారా?
నేడు భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే... మనోళ్లు కొట్టేస్తారా?
  • Share this:
India vs Australia 1st ODI | ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాతో ఏ జట్టు ఆడినా ఓడిపోవడం ఖాయమే అనే అభిప్రాయం అభిమానుల్లో ఉంటుంది. ఐతే... ఆస్ట్రేలియాతో ఆడితే గెలుపు ఎవరిది అన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈమధ్య కాలంలో టీమిండియా వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక లాంటి జట్లను ఈజీగా ఓడించేసి... వరుస సిరీస్‌లు కొట్టేసింది. అందువల్ల టీమిండియాలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఐతే... ఓడిపోయిన జట్ల సంగతి ఎలా ఉన్నా... ఇవాళ తలపడుతున్న ఆస్ట్రేలియా మామూలు జట్టుకాదు. దానికి బ్యాటింగ్, బౌలింగ్ రెండూ పవర్‌ఫుల్‌గానే ఉన్నాయి. అంతేకాదు... టీమిండియాకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ ఇతరత్రా ఉన్నట్లే... ఆసీస్‌కి స్మిత్, వార్నర్ వంటి వాళ్లున్నారు. ఏ జట్టునూ తక్కువ అంచనా వేసేలా లేవు. అయినప్పటికీ... ఇదివరకట్లా ఆస్ట్రేలియాకి దొరికిపోయే ఛాన్స్ ఉండదనీ, మేమేంటో చూపిస్తామని విరాట్ కోహ్లీ చెబుతున్నాడు. దానికి తోడు పిచ్... ఎక్కువ పరుగులు ఇచ్చే రకం. అందువల్ల రెండు జట్లూ దుమ్మురేపే ఛాన్సుంది.


మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ఇవాళ... ముంబై లోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 1.30కి ప్రారంభం కానుంది. ఆ సమయంలో... ఏ సినిమాకో వెళ్లకపోయి ఉంటే... ఈ మ్యాచ్‌ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చంటున్నారు అభిమానులు. 2018లో భారత పర్యటనకు వచ్చిన కంగారూలు... 3-2తో సిరీస్ గెలుచుకొని... టీమిండియాకు షాక్ ఇచ్చింది. ఈసారి ప్రతీకారం తీర్చుకుంటామని విరాట్ కోహ్లీ చెబుతున్నాడు. ఇప్పటి వరకూ ఈ రెండు దేశాలూ... 57 వన్డే సిరీస్‌లు ఆడాయి. భారత్‌ 14, ఆస్ట్రేలియా 26 గెలిచాయి.




భారత జట్టు అంచనా : విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), ధవన్‌, రోహిత్‌, జాదవ్‌, జడేజా, రాహుల్‌, శ్రేయాస్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌, షమి/సైనీ.

ఆస్ట్రేలియా జట్టు అంచనా : ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌, ఆస్టన్‌ అగర్‌, కమిన్స్‌, హ్యాండ్స్‌కోంబ్‌, స్టార్క్‌, హాజెల్‌వుడ్‌, కేరీ, జంపా.
First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు