Home /News /sports /

INDIA VS AUSTRALIA NETIZENS APPRECIATES MANISH PANDEYS ONE HANDED SPIDER MAN CATCH TO DISMISS DAVID WARNER IN 2ND ODI WATCH VIDEO

Watch Video: వాహ్...వాహ్...మనీశ్ పాండే ‘స్పైడర్ మ్యాన్’ క్యాచ్

గాల్లో ఎగిరి ఒక చేత్తో క్యాచ్ పట్టి డేవిడ్ వార్నర్‌ని పెవిలిన్ పంపిన మనీశ్ పాండే(Photo: BCCI)

గాల్లో ఎగిరి ఒక చేత్తో క్యాచ్ పట్టి డేవిడ్ వార్నర్‌ని పెవిలిన్ పంపిన మనీశ్ పాండే(Photo: BCCI)

India vs Australia 2nd ODI- Manish Pandey Catch | రాజ్‌కోట్ వన్డేలో డేవిడ్ వార్నర్‌ కొట్టిన బంతిని మనీశ్ పాండే గాల్లోకి ఎగిరి క్యాచ్ చేశాడు. మనీశ్ పాండే క్యాచ్‌ని స్పైడర్ మ్యాన్ క్యాచ్ అంటూ నెటిజన్స్ అభినందిస్తున్నారు.

    భారత్-ఆసీస్ మధ్య రాజ్‌కోట్‌లో జరిగిన రెండే వన్డేలో 36 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం సాధించడం తెలిసిందే. రిషభ్ పంత్ గాయంకారణంగా జట్టుకు దూరంకావడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన మనీశ్ పాండే బ్యాటింగ్‌లో నిరాశపరిచినా...ఫీల్డింగ్‌లో మాత్రం పాదరసంలా కదిలిపోయాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, మనీశ్ పాండే అద్భుతమైన ఫీల్డింగ్‌తో మెప్పించారు. మనీశ్ పాండే క్యాచ్ మ్యాచ్‌‌లో హైలైట్‌గా నిలిచింది. నాలుగో ఓవర్‌లో షమీ బౌలింగ్‌లో ఆసీస్ డేంజర్ ఆటగాడు డేవిడ్ వార్నర్(15) భారీ షాట్ ఆడగా..తల మీద చాలా ఎత్తులో వెళ్తున్న బంతిని మనీశ్ పాండే గాల్లో ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో వార్నర్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.



    మనీశ్ పాండే క్యాచ్‌ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మనీశ్ పాండేది స్పైడర్ మ్యాన్ క్యాచ్ అంటూ కొందరు అభినందిస్తున్నారు.





    రాజ్‌కోట్ వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్చిండ్ ఎందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు సాధించింది. శిఖర్ థావన్(96), కేఎల్ రాహుల్(65), విరాట్ కోహ్లీ(78) అర్ధ శతకాలతో రాణించారు. 341 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్..49.1 ఓవర్లలో 304 పరుగులు సాధించి ఆలౌట్ అయ్యింది. దీంతో 36 పరుగుల తేడాతో మ్యాచ్‌ని గెలిచిన భారత్...మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. షమీ మూడు వికెట్లు, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, నవ్‌దీప్ సైనీ తలా రెండేసి వికెట్లతో రాణించారు. సిరీస్ నిర్ణయాత్మక చివరి వన్డే బెంగుళూరులో ఆదివారం జరగనుంది.
    Published by:Janardhan V
    First published:

    Tags: Cricket, Manish pandey

    తదుపరి వార్తలు