• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS AUSTRALIA MS DHONI DITCHES GLOVES WITH ARMY INSIGNIA AFTER ICC DENIES PERMISSION SK

ఎంఎస్ ధోనీ గ్లోవ్స్ చూశారా...ఈ సారి బలిదాన్ చిహ్నం లేదు...

ఎంఎస్ ధోనీ గ్లోవ్స్ చూశారా...ఈ సారి బలిదాన్ చిహ్నం లేదు...

మహేంద్ర సింగ్ ధోనీ(ఫైల్ ఫోటో)

ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు వినియోగించే వస్తువుల మీద ఎలాంటి రాజకీయ, మతపరమైన, జాతివిద్వేషపూరిత సందేశాలు ఉండకూడదు.

  • Share this:
    ధోనీ గ్లోవ్స్‌పై ఉన్న 'బలిదాన్' గుర్తు ఇటీవల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బలిదాన్ గుర్తున్న గ్లోవ్స్ ధరించడంపై దుమారం రేగింది. ధోనీ దేశభక్తికి నెటిజన్లు ఫిదా కాగా..ఐసీసీ మాత్రం తీవ్ర అభ్యంతరం చెప్పింది. గ్లోవ్స్‌, జెర్సీలో స్పానర్స్‌కి సంబంధించిన లోగోలు తప్ప ఎలాంటి గుర్తులు ఉండకూడదని స్పష్టంచేసింది. బలిదాన్ గుర్తు స్పాన్సర్‌షిప్‌ నిబంధనలను అతిక్రమించినట్టవుతుందని వాదించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో బలిదాన్ చిహ్నం లేని గ్లోవ్స్‌ను వేసుకుని ఆడాడు ధోనీ.

    ‘బలిదాన్’ మార్క్‌ను పారా మిలటరీ బలగాలు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్‌, పారాచూట్ రెజిమెంట్ ఈ గుర్తును వినియోగిస్తూ ఉంటాయి. బలిదానానికి ప్రతీకగా దీన్ని భావిస్తారు. ఎంఎస్ ధోనీకి దేశ భక్తి ఎక్కువ. భారత సైన్యం అంటే ఎంతో గౌరవం. అంతేకాదు పారా టీఏ (టెరిటోరియల్ ఆర్మీ)కి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బలిదాన్ చిహ్నమున్న గ్లోవ్స్ ధరించాడు ధోనీ. దాన్ని చూసి నెటిజన్లు ధోనీ దేశభక్తి గురించి సోషల్ మీడియాలో తెగ మెచ్చుకున్నారు.

    ఐతే బలిదాన్ గుర్తుపై ఐసీసీ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి గుర్తులను వినియోగించకూడదని స్పష్టం చేసింది. బలిదాన్ విషయంలో ధోనీకి బీసీసీఐ బాసటగా నిలిచినప్పటికీ ఐసీసీ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మ్యాచ్‌లో బలిదాన్ గుర్తు లేని గ్లోవ్స్ ధరించాడు ధోనీ.


    కాగా, ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు వినియోగించే వస్తువుల మీద ఎలాంటి రాజకీయ, మతపరమైన, జాతివిద్వేషపూరిత సందేశాలు ఉండకూడదు. ఐసీసీ క్లోతింగ్ అండ్ ఎక్విప్ మెంట్ రెగ్యులేషన్స్ నిబంధనల ప్రకారం, కీపింగ్ గ్లోవ్స్ మీద నాన్ కమర్షియల్ లోగో, చారిటీ లోగో ధరిస్తే మొదటి సారి హెచ్చరికతో వదిలేస్తారు. ధోనీ కేసు దీని కిందకే వస్తుంది. దాంతో తొలిసారి నేరంగా పరిగణించి అతన్ని మందలించింది ఐసీసీ. ఇక ఏడాది లోపు ఇదే తప్పును రెండోసారి చేస్తే మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధిస్తారు. మూడోసారి చేస్తే 50శాతం, నాలుగోసారి చేస్తే 75శాతం కోత విధిస్తారు.
    First published: