• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS AUSTRALIA MOHAMMED SIRAJ TEARS UP IN SYDNEY TEST WATCH SA

Siraj: సిరాజ్ కంట కన్నీరు.. ఉబికొస్తున్న దుఖ్ఖాన్ని దిగమింగుకుంటూ..

Siraj: సిరాజ్ కంట కన్నీరు.. ఉబికొస్తున్న దుఖ్ఖాన్ని దిగమింగుకుంటూ..

Mohammed Siraj gets emotional

సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టాడు. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో రెండో టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ ఆ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇచ్చాడు.

  • Share this:


    సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టాడు. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో రెండో టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ ఆ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. గురువారం ఎస్సీజిలో జరుగుతున్న మూడు టెస్ట్‌లో ప్రారంభమైంది. ఆటకు ముందు టీంతో జాతీయ గీతం పాడుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. సిరాజ్ లోలోపల్నుండి ఉబికొస్తున్న దుఖ్ఖాన్ని దిగమింగుకుంటూ కన్నీళ్ళ తుడుచుకుంటూ జాతీయ గీతాన్ని అలపించాడు. దీని సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్ ఖాతలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.





    26 ఏళ్ల సిరాజ్‌‌ క్రికెట్ కేరీర్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన ఇవ్వగలిగితే టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. ఈ టూర్‌లో ఉన్న సమయంలోనే గత ఏడాది నవంబర్ 20 న మహ్మద్ తండ్రిని కోల్పోయాడు. అయిన ఆ విషాదాన్ని దిగమింగుకుంటూ ఈ టూర్‌లొ కోనసాగుతున్నాడు.

    అయితే మహ్మద్ సిరాజ్ తన తండ్రి మహ్మద్ గౌస్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడానికి కారణం ఏంటో వెల్లడించాడు. తన తల్లి రావొద్దని కోరిందని, క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చూపడం ద్వారా తండ్రి కలను నెరవేర్చాలని తన తల్లి చెప్పిందని మహ్మద్ సిరాజ్ చెప్పాడు. ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపికైన టెస్టు జట్టులో మహ్మద్ సిరాజ్ తొలిసారి స్థానం సంపాదించాడు. గత శుక్రవారం (నవంబర్ 20) సిరాజ్ తండ్రి చనిపోయారు. ‘తండ్రి మరణం నాకు తీరని లోటు. మా నాన్న నన్ను ఎప్పుడూ ప్రోత్సహించాడు. నేను భారత్‌కోసం క్రికెట్ ఆడాలనేది నా తండ్రి కల. దేశం గర్వపడేలా చూడాలని కోరుకుంటున్నా. నా తండ్రి కలను నెరవేర్చాలనుకుంటున్నా. మా నాన్న ఎప్పుడూ నాతోనే ఉంటారు.

    ఈ పరిస్థితుల్లో ప్రతి టీమ్ మెంబర్ నాకు అండగా నిలబడ్డారు. నాకు చాలా భరోసా కల్పించారు. విరాట్ కోహ్లీ కూడా ధైర్యం చెప్పాడు. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పాడు. మా నాన్న చనిపోయినప్పుడు అమ్మతో మాట్లాడా. ఆస్ట్రేలియాలోనే ఉండి, మా నాన్న కలను నిజం చేయమని చెప్పింది.’ అని సిరాజ్ అన్నాడు.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు