• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS AUSTRALIA LIVE SCORE 3RD TEST MATCH JOSH HAZLEWOOD STUNS WITH A BRILLIANT DIRECT HIT VIDEO GOES VIRAL SRD

Ind vs Aus : టీమిండియా పతనాన్ని శాసించిన హజెల్ వుడ్ సూపర్ రనౌట్.. వీడియో వైరల్

Ind vs Aus : టీమిండియా పతనాన్ని శాసించిన హజెల్ వుడ్ సూపర్ రనౌట్.. వీడియో వైరల్

Josh Hazlewood

Ind vs Aus : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 96/2 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్ అంతగా ఆకట్టుకోలేదు. అయితే హజెల్ వుడ్ సూపర్ రనౌట్ ఈ ఇన్నింగ్సే కే హైలెట్ గా నిలిచింది.

  • Share this:
    ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 96/2 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్ అంతగా ఆకట్టుకోలేదు. పుజారా హాఫ్ సెంచరీ మినహా మిగతా బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మూడు రనౌట్లు కూడా టీమిండియాను బాగా దెబ్బతీసింది. కమిన్స్, హాజెల్ వుడ్ బౌలింగ్ బాగా వేయడంతో..టీమిండియా 244 పరుగులకు ఆలౌటైంది. అయితే హజెల్ వుడ్ సూపర్ రనౌట్ ఈ ఇన్నింగ్సే కే హైలెట్ గా నిలిచింది. 68వ ఓవర్‌లో అనవసరపు రన్‌కు ప్రయత్నించిన విహారిని హజల్‌వుడ్ బుల్లెట్ లాంటి త్రో వేసి ఔట్ చేశాడు. దీంతో 38 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసిన విహారి పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్‌లో షేర్ చేసింది. వాట్ ఏ ఫీలింగ్‌ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేసింది. విహారి ఔట్ అవ్వడంతో టీమిండియా వికెట్ల పతనం మొదలైంది.

    ఇక ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. నాలుగు వికెట్లు తీయగా, హజెల్ వుడ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆటగాళ్లు చటేశ్వర పూజారా, అంజిక్య రహానేలు భారత భారత స్కోర్‌ బోర్డ్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వీరు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే రహానె పెవిలియన్‌కు చేరాడు. కమిన్స్ వేసిన బంతికి రహానె క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత పుజారా హాఫ్ సెంచరీ తప్ప టీమిండియా ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ మెరుపు లేదు. వచ్చిన బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో టీమిండియా 244 పరుగులకే ఆలౌట్ అయింది.


    ఆఖర్లో జడేజా లాస్ట్ లో కొంచెం బ్యాటు ఝళిపించాడు. కానీ, అప్పటికే ఆలస్యమైంది. ఆఖరి వికెట్ గా సిరాజ్ కమిన్స్ బౌలింగ్ లో ఔటవ్వడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. జడేజా 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, టీమిండియా ఇన్నింగ్స్ లో మూడు రనౌట్లు ఉన్నాయ్. ఈ రనౌట్లే టీమిండియా ఇన్నింగ్స్ ను కొంపముంచాయ్. అనవసర రన్ కు ప్రయత్నించి వికెట్ల కోల్పోవడం టీమిండియా ఇన్నింగ్స్ ను దెబ్బతీసింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాలో తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు