• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • INDIA VS AUSTRALIA LIVE SCORE 3RD TEST MATCH INDIA ALL OUT 244 AT SCG LIVE SCORE UPDATE SRD

Ind vs Aus : టపా టపా వికెట్లు కోల్పోయి ఆలౌటైన టీమిండియా.. రెచ్చిపోయిన ఆసీస్ బౌలర్లు

Ind vs Aus : టపా టపా వికెట్లు కోల్పోయి ఆలౌటైన టీమిండియా.. రెచ్చిపోయిన ఆసీస్ బౌలర్లు

India vs Australia

Ind vs Aus : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 96/2 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్ అంతగా ఆకట్టుకోలేదు. పుజారా హాఫ్ సెంచరీ మినహా మిగతా బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.

  • Share this:
    ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 96/2 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్ అంతగా ఆకట్టుకోలేదు. పుజారా హాఫ్ సెంచరీ మినహా మిగతా బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మూడు రనౌట్లు కూడా టీమిండియాను బాగా దెబ్బతీసింది. కమిన్స్, హాజెల్ వుడ్ బౌలింగ్ బాగా వేయడంతో..టీమిండియా 244 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. కమిన్స్ నాలుగు వికెట్లు తీయగా, హాజెల్ వుడ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఇది సాధ్యమైంది.మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆటగాళ్లు చటేశ్వర పూజారా, అంజిక్య రహానేలు భారత భారత స్కోర్‌ బోర్డ్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వీరు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే రహానె పెవిలియన్‌కు చేరాడు. కమిన్స్ వేసిన బంతికి రహానె క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కమిన్స్ వేసిన బంతిని రహానె కట్ చేసేందుకు ప్రయత్నించగా.. అది లోపలికి చొచ్చుకుని వచ్చి వికెట్లను తాకింది.

    ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హనుమ విహారి.. క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. 68వ ఓవర్‌లో అనవసరపు రన్‌కు ప్రయత్నించిన విహారిని హజల్‌వుడ్ బుల్లెట్ లాంటి త్రో వేసి ఔట్ చేశాడు. దీంతో 38 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసిన విహారి పెవిలియన్‌కు చేరాడు. ఇక, ఆ తర్వాత క్రీజులో వచ్చిన పంత్.. పూజారాతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. వీరిద్దరూ 50 పరుగుల పార్టనర్ షిప్ ను కూడా నమోదు చేశారు. అయితే, షాట్ బౌల్స్ కి ఇబ్బంది పడిన పంత్.. 36 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద హాజెల్ వుడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.


    ఆ తర్వాత వెంటనే పుజారా కూడా కమిన్స్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత అశ్విన్ 10 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇక నవదీప్ షైనీ, బుమ్రా కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అయితే, జడేజా లాస్ట్ లో కొంచెం బ్యాటు ఝళిపించాడు. కానీ, అప్పటికే ఆలస్యమైంది. ఆఖరి వికెట్ గా సిరాజ్ కమిన్స్ బౌలింగ్ లో ఔటవ్వడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. జడేజా 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, టీమిండియా ఇన్నింగ్స్ లో మూడు రనౌట్లు ఉన్నాయ్. ఈ రనౌట్లే టీమిండియా ఇన్నింగ్స్ ను కొంపముంచాయ్. అనవసర రన్ కు ప్రయత్నించి వికెట్ల కోల్పోవడం టీమిండియా ఇన్నింగ్స్ ను దెబ్బతీసింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాలో తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు