India vs Australia: కోహ్లీ దూకుడు...రోహిత్ ఔట్..విజయం వైపు టీమిండియా...

61 బంతుల్లో 4ఫోర్లతో కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. సెంచరీ వీరుడు రోహిత్‌ 119 పరుగులు చేసి 36.4 ఓవర్ల వద్ద ఔట్ కాగా, క్రీజ్ లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో కలిసిన కోహ్లీ స్కోరుబోర్డును పరుగెలెత్తిస్తున్నాడు.

news18-telugu
Updated: January 19, 2020, 8:28 PM IST
India vs Australia: కోహ్లీ దూకుడు...రోహిత్ ఔట్..విజయం వైపు టీమిండియా...
(image: BCCI)
  • Share this:
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రోహిత్ శర్మ9119) సెంచరీ బాది ఔట్ కాగా, కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.61 బంతుల్లో 4ఫోర్లతో కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. సెంచరీ వీరుడు రోహిత్‌ 119 పరుగులు చేసి 36.4 ఓవర్ల వద్ద ఔట్ కాగా, క్రీజ్ లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో కలిసిన కోహ్లీ స్కోరుబోర్డును పరుగెలెత్తిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా నిర్ణయించిన 287 పరుగులు టార్గెట్ చేదనలో భారత్ నిలకడగా ఆడుతోంది.

అంతకు ముందు బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా జట్టులో ఆసీస్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ (131) సెంచరీతో అదరగొట్టగా, లబుషేన్‌(54), అలెక్స్‌ క్యారీ(30) రాణించారు. ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు సాధించింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా రెండు వికెట్ల పడగొట్టారు. ఇదిలా ఉంటే టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 46 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఆసీస్‌ కష్టాల్లో పడింది. డేవిడ్ వార్నర్ కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు. అయితే లబుషేన్‌తో కలిసి స్టీవ్‌ స్మిత్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. లబుషేన్‌ నిష్క్రమణ తర్వాత అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన మిచెల్‌ స్టార్క్‌‌(0) భారీ షాట్‌కు యత్నించి జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లలో షమీ 4 వికెట్లు తీసి సత్తా చాటగా.. జడేజా 2, నవదీప్ సైనీ 1, కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు