India vs Australia: వడివడిగా విజయం వైపు టీమిండియా...సెంచరీ వైపు రోహిత్ పరుగులు

ధవన్ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ ఎల్బీగా వెనుదిరగడంతో మూడో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. టీమిండియా 25 ఓవర్లు ముగిసే సమయానికి 128 పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది.

news18-telugu
Updated: January 19, 2020, 7:32 PM IST
India vs Australia: వడివడిగా విజయం వైపు టీమిండియా...సెంచరీ వైపు రోహిత్ పరుగులు
(Image:BCCI)
  • Share this:
చినస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. ఆస్ట్రేలియా నిర్ణయించిన 287 పరుగులు టార్గెట్ చేదనలో భారత్ నిలకడగా ఆడుతోంది. రోహిత్ శర్మ 56 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ధవన్ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ ఎల్బీగా వెనుదిరగడంతో మూడో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. టీమిండియా 25 ఓవర్లు ముగిసే సమయానికి 128 పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది.

మూడో వన్డేలో టీమిండియాకు ఆస్ట్రేలియా 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ (131) సెంచరీతో అదరగొట్టగా, లబుషేన్‌(54), అలెక్స్‌ క్యారీ(30) రాణించారు. ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు సాధించింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా రెండు వికెట్ల పడగొట్టారు. ఇదిలా ఉంటే టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 46 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఆసీస్‌ కష్టాల్లో పడింది. డేవిడ్ వార్నర్ కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు. అయితే లబుషేన్‌తో కలిసి స్టీవ్‌ స్మిత్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. లబుషేన్‌ నిష్క్రమణ తర్వాత అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన మిచెల్‌ స్టార్క్‌‌(0) భారీ షాట్‌కు యత్నించి జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు